Well-Disciplined Life Of a Vision
Having a goal and a vision is a Blessing.A Life without a goal is a life without a reason.Life without a vision is useless and waste both in spirit and in body/flesh.
ఒక గురి కలిగిన జీవితము అనేది క్రమశిక్షణలో నడుచుకుంటున్న జీవితము.క్రమశిక్షణ అనగా దేవుని వలన బోధింపబడేది,దేవుని వలన బోధించబడే వ్యక్తి ఒక నియమనిబంధనతో కూడిన గురి కలిగియుంటాడుఅలాంటి జీవితము అనగా గురి లేని జీవితము దారము తెగిన గాలిపటం వంటిది ఆది ఎంతటి విలాసవంతమైన జీవితమైనా,అనుకున్నవి అన్నీ-కోరినవి అన్నీ అనుభవించిన జీవితమైనా,ఆది శూన్యమే మరింత స్పష్టముగా వ్యర్ధమే.ప్రతీ జీవితానికి ఒక లక్ష్యము,గురి,దర్శనం ఒక్కటి ఉంటుంది.ఆ గురిని తప్పటమే మరణము అని పాత నిబంధన స్పష్టపరస్తుంది.మరణము అంటే గురి తప్పిపోవుట.పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించుట అని క్రొత్తనిబంధనలో యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను సూటిగా చెప్తున్నారు .ప్రతి జీవితానికి ఒక గురి ఉంది.అయితే నీ జీవితములో దేవుని గురి ఏంటో,ఆయన అభిలాష ఏదో? అది తెలుసుకొని దానిని చేరడమే దేవుని చిత్తము,దేవుని నమ్మి జీవితాన్ని అలా కొనసాగిస్తున్నాము అంటే కాదు,దేవుని నమ్మిన ప్రతి వ్యక్తి ప్రత్యేక సమయాలలో చేయవలసిన ఒక ప్రత్యేక విధులు,కర్తవ్యాలు ఉన్నాయి.నీ జీవితములో దేవుని ఉద్దేశ్యము ఏంటి?ఆయన చిత్తము ఏంటి?ఆయన గురి ఏమిటి?ఆయన సంకల్పము ఏంటి?పరిశుద్ధపరచబడుటయే ఆయన చిత్తము,నీవు దేవుని రాజ్యము సంపాదించుటయే ఆయన గురి.
సరే...నీవు నిర్వర్తించవలసిన కర్తవ్యము,విధి ఏంటి?ఎందుకంటె విశ్వసించే వ్యక్తి,నమ్మే ప్రతి వ్యక్తి ఒక సోమరిగా,తన సొంత పనులు చేసుకుంటూ హాయిగా బ్రతకడానికి కాదు కదా! సిలువలో ప్రభువువారు ప్రాణము పెట్టినది.కాబట్టీ ఇప్పుడే ప్రభువు యొద్ద నుండి నీ కోరకైనా గురి,దర్శనము ఏమిటో తెలుసుకుని దానిని సంపాదించుకో!
*ఫిలిప్పీయులకు 3: 12
ఇదివరకే నేను గెలిచితిననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను.
*1కోరింథీయులకు 9: 26,27
కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడనుకాను,గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.
*నిజముగా క్రీస్తు ప్రభువువారు నిన్నే ఎందుకు పట్టుకున్నారు?నిజముగా మనకు ఒక గురి,దర్శనము లేకపోతె మనము ప్రభువును ఆయన పరిశుద్ధ పిలుపును నమ్మినవారము కాము.ప్రభువు చేత బోధింపబడువారము కాము.ప్రభువు నిన్ను దర్శించుటకు కారణము ఏమిటీ?నీ పట్ల ఆయన దర్శనము ఏమిటీ?నిన్ను ఎలా చూడాలి అనుకుంటున్నారు ఆయన?ప్రభువు చేత బోధింపబడలేదు గనుకే గురి లేకుండా బ్రతుకుతున్నాం.జీవితములో ఫలనా వయస్సులో వివాహము,ఫలనా వయస్సులో పిల్లలు,ఫలనా వయస్సులో ఉద్యోగము,ఫలాన వయస్సులో సెట్టిల్ ,ఇల్లు కట్టించాలి లేదు కొనాలి,అన్నీ ఒక ప్లాన్లో జరగాలనే గురి కాదండి.అది భూసంబంధమైనది,శరీరసంబంధమైన వ్యక్తి ఆలోచించేది..ఒక క్షణము ఆలోచించండి!!!దేవునికి ఒక గురి ఉంది.మరింత స్పష్టంగా ఆయనకి ఓ భారీ ప్రణాలిక ఉందీ నీ పట్ల ,అది ఎంత పెద్దదంటే జగత్తు పునాది వేయబడకముందే రూపించబడింది.(ఎఫెసీ-1:6
మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.)
*according as he has chosen us in him before the world's foundation, that we should be holy and blameless before him in love; having marked us out beforehand for adoption through Jesus Christ to himself, according to the good pleasure of his will,
Ephesians 1:4-5 DARBY
*Ephesians-1:3-6 "He had us in mind,had settled on us as the focus of His Love,Long long ago He decided us,
*Ephesians -1:12 Pre-trusted us,that we should be to the praise of his glory who have pre-trusted in the Christ:
*నీ మీద, నా మీద దేవుడు పెట్టిన గురి ఎంత గొప్పదో తెలుసా?యెషయా 14: 27
సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించి యున్నాడు రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడెవడు?
For the Lord of hosts has purposed, and who will annul it? His hand is stretched out, and who will turn it back?Isaiah 14:27 ESV.
*నీ పట్ల ఆయన కలిగియున్న ఆలోచనకు, నీవే గనుక లోబడితే ఆది సదాకాలము నిలుస్తుంది.ఎందుకంటే వాక్యము ఇలా చెప్తుంది, కీర్తనలు 33:11
యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును.నీ పట్ల ఆయన ఆలోచన,ఆయన గురి,ఆయన సంకల్పము,ఉద్దేశమే నీకు క్షేమము.ఆ గురి,ఆ ఉద్దేశ్యము మనము కూడా తెలుసుకుని పౌలు వలె ఇంకా ఎందరోభక్తులు ఎంతటి నిష్టతో
*Hebrews -11:27~[Motivated] by faith he left Egypt behind him, being unawed and undismayed by the wrath of the king; for he never flinched but held staunchly to his purpose and endured steadfastly as one who gazed on Him Who is invisible. AMPC
*And when she saw that she was stedfastly minded (determined -ESV)(heart set to go-MSG)to go with her, she left off speaking to her.Ruth 1:18 DARBY
*Daniel purposed(resolved-ESV)(determined-AMPC)(made up his heart-AMP) in his heart to not defile himself..Daniel-1:8 DARBY
*In their mother’s womb he took his brother by the heel, And in his maturity(in his strength he wrestled-DARBY) he contended with God. ఆ గురిని చేరుటకు,పరుగెత్తి కిరీటం సంపాదించారో,మనము కూడా మన జీవితప్రయాణము,పోరాటములో విఫలము,వ్యర్ధము కాకుందా నిష్ప్రయోజనము కాకుండ కిరీటము దక్కించుకొనగలము.మన అనుదిన జీవితములోను నియమ నిబంధనలు,ఒక క్రమము కావాలి లేదంటే, దేవుడు మనకిచ్చిన గురిలోనుండి ఒక్కసారిగా తొలగిపోయే వీలుకాదు కానీ,చిన్న చిన్న గా జారిపోయే ప్రమాదము మాత్రమే ఉంటుంది.ఎందుకంటె నియమప్రకారము పోరాడమని వాక్యము కూడా స్పష్టముగానే చెప్తుంది.2తిమోతికి 2:5
మరియు జెట్టియైనవాడు పోరాడుతున్నప్పుడు, నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు.
ఓ చక్కటి ఉదాహరణ మన రక్షకుడైన యేసుప్రభువువారే!ఆయన (శరీరధారిగా)రాక కోరకు లోకము ఇంచుమించు4000 సంవత్సరములు ఎదురుచూచింది.అయితే ఆయన భూమికి వచ్చి శరీరధారిగా జీవించినది మాత్రమే 30 సంవత్సరాలె,ఆది కూడా లోకము ఎదురుచూచిన రక్షణ పరిచర్య కేవలము 3 1/2 సంవత్సరములు మాత్రమే.అంటే మన ప్రభువు ఎంత నియమ నిబద్ధతతో పనిచేశారు.ప్రతి పగలు భోదించేవారు,ప్రతి రాత్రి ప్రార్ధించేవారు.Look,how organised and Well-Disciplined our LORD is.He Himself has shown a way for us.సామెతలు గ్ర0ధము అంతకూడా ఒక నియమ నిబద్ధతతో నిండిన ప్రవర్తనయితే,31 వ అధ్యాయము దాని నేరవేర్పు సారాాంశము ఒక స్త్రీ జీవితములో కనబడుతుంది.
The summary of Proverbs is filled with the character which is well-disciplined,and in the 31st chapter is the fulfillment of it.
*అలంటి గురి ,నియమ నిబద్ధతతో కూడిన భక్తి చేయుచు,ప్రభువు మనపట్ల కలిగియున్న గురిని చేరుకుని కిరీటము పొందుదాము.పరిశుద్దాత్మ దేవుడు మనకు సహాయపడతారు.ఆమెన్!
May God Bless You.Amen
~StephyBlesseena.
Praise the Lord
ReplyDelete