Remembering God's deeds-దేవుని జ్ఞాపకము చేసికొనుట

మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు.

1సమూయేలు 17: 37
​సింహము యొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు-పొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను.
దావీదు నిజముగానే యుద్దము చేసి గొల్యాతును గెలిచాడా?యుద్ధం అంటే ఇద్దరు పోరాడితేనే కదా...మరి ఎలా ఏకముగా లోయలో అలాంటి పోరాటాలు ఏమి జరుగలేదే!
అంతా సునాయాసముగా దావీదు గొల్యాతును ఎలా గెలిచాడు?అలా యుద్ధము చేయకుండనే నామమాత్రముగా అలా చేయి ఆడించి.... గెలిచాడా దావీదు?

ఇశ్రాయేలీయులు చూడని యుద్దాలా,వారికి పరిచయము లేని యుద్దాలా?ఐగుప్తు విడిచినది మొదలు,ఎన్నెన్ని యుద్దాలు చేసి గెలిచారు,మరి ఈ సమయంలో వారికి ధైర్యము కలగలేదు.వారికి కలుగని ధైర్యము దావీదుకు ఎలా కలిగింది?ఇశ్రాయేలీయుల మీద మొదటిగా అభిషేకింపబడిన రాజైన సౌలుకు కూడ ధైర్యము కలగలేదు.దేవుని మేలులు జ్ఞాపకము చేసికొనడం సర్వ సామాన్యమైన స్తుతి అనుకుంటాము,కాని ఆ జ్ఞాపకములో ఎంత బలముందో,శక్తి ఉందో!అదే మన ప్రాణానికి నిరీక్షణ,బలము అని తెలుసుకోవాలి.దేవుని కార్యాలను,ఆయన చేసిన మేలులు,ఆయన చేసిన వాటిని జ్ఞాపకము చేసికొనడము వలన
1.మనము దేవుని హస్తాన్ని మన జీవితములో ఒప్పుకుంటున్నట్లు.
2.మరలా మరియొకసారి దేవుని హస్తాన్ని,దేవుని కార్యాన్ని స్థాపించుకుంటున్నట్లు.
3.దేవుని కార్యము కోరకు మార్గము సిద్దం చేసికొనునట్లు.
4.అలా జ్ఞాపకము చేసికొనడము వలన మనలో విశ్వాసము నూతనముగా రూపించబడి ఏర్పడుతుంది.

*మన జీవితంలో దేవుని కార్యాలను జ్ఞాపకము చేసికొనుట చాలా ఆశీర్వాదకరము.అందుకే దావీదు తన ప్రాణమును,తన అంతరంగాన్ని మేల్కొలిపుతున్నాడు.నా ప్రాణమా,నా అంతరంగమున నున్న సమస్తమా...యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకుము.ఆ దేవుని కార్యము మన మనస్సు,శరీరము మరచిపోయినా గాని..ఆ కార్యము యొక్క ప్రభావము ఎన్నడు చావదు.అందుకే అందులోని శక్తి మరల మరల మనం అనుభవిస్తుండచు.
*కీర్తనలు 111: 4
ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థసూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు.
✓ఆయన కార్యములు దొడ్డవి.గంభీరమైనవి.కీర్తనలు -92:5
✓ఆయన కార్యములు సంపూర్ణములు.ద్వితియోప-32:3
Re-living the moment. అంటే ఇదేనేమో!మరలా మరలా ఆ కార్యాన్ని,ఆ దేవుని బాహువును,ఆ ప్రభావాన్ని పునర్జీవించము,అనుభవించడము.
✓మరల...మరియొక్కసారి దేవుని మన జీవితం లోకి అనుమతించడము,ఆహ్వానించదము ఆయన కార్యాన్ని జ్ఞాపకము చేసికొనుట అంటే.
👉 ఏలా లోయలో దావీదు అదే చేస్తున్నాడు,సింహపు బలమునుండి,దాని నోటి నుండి,ఎలుగుబంటి బలమునుండి,దాని నోటినుండి,దేవుడు ఎలా కాపాడారో!ఆ క్షణాన్ని మరలా...అనుభవిస్తూ,మరింత స్పష్టముగా ఆ క్షణము దేవుని బాహువును ఎలా అనుభవించాడో ఇప్పుడు సౌలు యెదుట నిలువబడినపుడు,ఆ బాహువును,ఆ దేవుని బలప్రభావమును అనుభవించుచున్నాడు గనుకనే,
1సమూయేలు 17: 36
​మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలె అగుననియు,
ఎంతో ధైర్యముగా,నిబ్బరముగా,గోల్యాటు ఒడింపబడుట చూచుచున్నట్లుగానే చెప్పగలుగుచున్నాడు.
🙌🙌హల్లెలూయా.
కాని ఇశ్రాయేలీయులు దావీదు వలె,దేవుని కార్యాలను జ్ఞాపకము చేసికొనలేదు,అదే వారి బలహీనత.
✓దేవుని కార్యాలను జ్ఞాపకము చేసికొనకపోవడము పాపము,నిర్లక్ష్యము,చులకనైన మనస్తత్వము.
✓ఐగుప్తు నుండి దాటివచ్చిన తరము కాక,వారి పిల్లల తరము వారు,తమ పూర్వీకులకు దేవుడు చేసిన కార్యములు జ్ఞాపకము చేసికొనలేదు,ఒకవేళ వారికి మరల మరల దేవుడు చెప్పజూచినకాని ఆ కార్యాలను వారు నమ్మలేదు.
*కీర్తనలు 78: 11
ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి.
*కీర్తనలు 78: 22
వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణయందు నమ్మిక యుంచలేదు.
*కీర్తనలు 78: 32
ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్యకార్యములను బట్టి ఆయనను నమ్ము కొనక పోయిరి.
*కీర్తనలు 78: 42
ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు.
*కీర్తనలు 78: 43
ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు.

77వ కీర్తనలో  ఆసాపు భక్తుడు,
*కీర్తనలు 77: 5
తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును.
*కీర్తనలు 77: 11
యెహోవా చేసిన కార్యములను,పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును
*కీర్తనలు 77: 12
నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును.
*కీర్తనలు 77: 14
ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొనియున్నావు.
విలపవాక్యములు గ్రంధంలో మరో మాట,యిర్మియా ప్రవక్త
విలాపవాక్యములు 3: 21
నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది.
అవును,ఆయన కార్యములు శాశ్వతమైనవి కదా...అందుకే వాటిని ఎప్పుడు జ్ఞాపకము చేసికొనినా అవి సజీవముగానే ఉంటాయి.మన జీవితములో ఇప్పటికి ఎన్ని మేలులు,సహాయలు,మొర ఆలకించుట,సమాధానము పొందిన ప్రార్థనలు,ఆయన బాహువు మనలను ఆదుకొనుట,హత్తుకొనుట,ఇలా ఎన్ని ఉన్నాయో! వాటినన్నిటిని మరువక..జ్ఞాపకము చేసుకుందాము!
*✓అప్పుడూ మనం కూడా దావీదు లాగ ఎంతటి గొల్యతను శూరునినైన ఎదురించి నిలబడుటకు శక్తి పొందుతాము.ఆ బలవంతుడైన ఆజానుబాహుడైన గొల్యాతును గురి చూసి కొట్టి ఒడించగలము.
ఈ వాక్యము చదువుచున్న మీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడతారు.ఆమెన్.
~StephyBlesseena.
Berachah Holy Fellowship,Ipuru.








Comments

Post a Comment

Popular posts from this blog

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

JESUS SAW THEM STRUGGLING! By Stephy Blessena

Our LORD, walking on the Waters-నీళ్ల మీద నడచి వస్తున్న ప్రభువు-BY STEPHY BLESSEENA