ఏలా లోయలో----దావీదు వడిసెల
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధనామములో ప్రియులైన వారికి వందనములు.ఈ రోజు దావీదు జీవితములో ఓ గొప్ప అనుభవము,అలాగే ఈశ్రాయేలీయుల చరిత్రలో కూడా మరపురాని సంఘటనను గూర్చి ధ్యానము చేద్దాము.1సమూయేలు-17: 50
గొల్యాతుతో జరిగిన యుద్దములో దావీదు విజయవీరుడయ్యడని చదువుకుంటాము.అవును అది నిజమే కాని దావీదు ఎలా జయించాడు?అంతటి ఆజానుబాహుని(ఆరుమూర్ల జానెడు ఎత్తు మనిషి. v4) చూచినప్పుడు దావీదుకు ఎలాంటి భయము కలుగలేదా? అలాంటి పరిస్థితిలో మనముంటే ఎప్పుడో పారిపోయేవారము.ఆ భాగమును పూర్తిగా చదివినపుడు దావీదు జయించాడని ఉంది, కాబట్టీ జయమొందినాడు అనుకుంటాం.కానీ ఆలోచించండి!!!అప్పటికి దావీదు వయస్సులోను,బలములోను చిన్నవాడే కానీ,ఇశ్రాయేలు సైనికాధ్యక్షులు ,రాజుసహితము ముందుకడుగేయలేని సమయములో ధైర్యమెలాగు వచ్చింది?11వ వచనము లో సౌలును ఇశ్రాయేలీయులందరును ఆ ఫిలిష్ఠీయులు మాటలు విన్నప్పుడు బహు భీతులైరి.ఎందుకని వారిలో కొంచెం కూడ చలనము,చురుకు కలుగలేదు?వారిలో లేని కారణం దావీదులో స్పష్టంగా కనబడుతుంది.వారి కారణము-17:25.
వారు ఎందుకు జయించలేకపోయారు అంటే,గోల్యాతును చూసినప్పుడు .......వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే;నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు.వానిని చంపిన వానికి 1.బహుగా ఐశ్వర్యము
2.రాజు తన కుమార్తేనిచ్చి పెండ్లి
3.వాని తండ్రి ఇంటివారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయును.
దావీదు కారణము-17:26
జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతిలేని ఫిలిష్ఠియుడు ఎంతటివాడు?యీ మాట దావీదు ఎన్ని సార్లు ఉపయోగించాడో!26వ,36,45.దావీదు చూపు,దృష్టి ఇస్రాయెలేయు దృష్టి వేరు.అందుకే అది వారికి అందలేదు.
జీవముగల దేవుని దూషిస్తుంటే,తిరస్కరిస్తుంటే,ప్రశ్నిస్తు ధిక్కరిస్తుంటే,ఎందుకని మిగిలిన వారంతా కొంచెమైన చలనము,చురుకు లేకుండా ఉండగలిగారు కారణము వారికి దేవుని సన్నిధి,ఆయన మనసు గురించిన అవగాహనే లేదు.కాని దావీదు దేవుని ఆత్మను కలిగినవాడు(16:13)దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి మాత్రమే దేవుని మనసు ఏదో గ్రహించగలడు.
*దావీదు అభిషేకింపబడిన తరువాత మొదటి యుద్ధము మరియు సౌలు దేవుని చేత విసర్జించబడి,రాజ్యము తనచేతిలోనుండి పోగొట్టుకున్న తరువాత జరిగిన మొదటి యుద్ధము:
✓ఇశ్రాయేలీయులు ఎవరిపక్షము నిలబడతారు రాజు పక్షముగాన లేక దేవుని పక్షముగా అని దేవుడు పరీక్షించిన యుద్ధము .
✓అంతలా గొల్యాతు తమను తమ దేవుణ్ణి తిరస్కరిస్తున్నా గాని 40 రోజులు వింత వినోదము చూసారె కాని కొంచెం అయినా తెగించి సాహసించి రోషముగలిగి నిలబడి శత్రువుని ఎదుర్కొన్నవారు కాదు.
✓కాని దావీదు యేటిలోయలోని(17:40)అయిదు నున్నని రాళ్లను ఏరుకుని,వారిలో ఒకదానిచేత జయించాడు.సౌలు తన యుద్ధకవచము(17:38),రాగి శిరస్త్రాణము,కత్తిని ఇచ్చాడు కానీ,దావీదు ఓ యదార్ధమైన మాట ఒప్పుకున్నాడు.ఇది మనమందారము ఒప్పుకోలేని సత్యము.17:39 ఇవి నాకు వాడుకలేదు.
AKJV-I have not proved them.
DARBY-I have not tried them.
ESV-I have not tested them.
MSG-Im not used to this.
ఇలాంటివి నేను నమ్మలేను.ఎందుకంటె నేను వాటిని నిర్దారించలేదు. ఎందుకంటె దేవుడు 🗡️కత్తిచేతనో,ఈటె 🔱చేతనో రక్షించువాడు కాదని నేను నమ్ముతున్నాను.
v37 సింహము,ఎలుగుబంటి యొక్క బలమునుండి నన్ను రక్షించిన యెహోవా ఈ సున్నతిలేని ఫిలిస్తీయుని చేతిలోనుండి కూడా విడిపిస్తాడు.
🌼🌼🌼🌼🌼🌼🌼🌸🌸🌸🌸🌸
మన జీవితంలో ఇలాంటి మహా శూరులైన గొల్యాతులు ఒక్కరు కాదు ఎందరో వస్తారు,గొల్యాతు వంటి సమస్యల,ఇబ్బందులు ఎదురవుతాయి.
*ఇశ్రాయేలీయులలాగ👭🧑🤝🧑👭🧑🤝🧑👭🧑🤝🧑👭👬👫👭🧑🤝🧑(17:8),గుంపుగా,
గొప్ప బలముతో💪,గొప్ప గొప్ప ఆయుధాలతో ⚔️
వెళ్లి జయించాలనీ, ఎదురుచూస్తూ
కనీసము యుద్ధభూమికి సమీపముగా
కూడా వెల్లకుండా దూరముగానే నిలువబడి ఓడిపోతుంటాము.ఆ గొల్యాతు మాత్రము ఎన్ని రోజులైనా అలా కనిపిస్తూ బలం ప్రదర్శించుచు తనకు తానే గెలుపొందినట్లు ప్రగల్బలముగా మాట్లాడుతాడు.వారైతే 40 రోజులే,కాని మనము ఎన్ని రోజులు అలాగే కాలము గడుపుతామో!40 అనెది సంపూర్ణ సంఖ్యాగ గుర్తుంపబడినది.ఏమో ఇశ్రాయేలీయులు ఓడిపోయారనే దేవుడు దావీదు ఆ సమయంలో అక్కడికి నడిపించారేమో! కొన్ని సార్లు మనము మోయలేని,వాడుకలేని ఆయుధాలే కావాలి అని మొండి పట్టుదల తో అలాగే నిలవబడి,ఒడిపోతాము.అలాంటి ఓటమి ఎన్ని సర్లు చవిచూసామో!కొన్ని సమయాల్లో మన ప్రశకు సమాధానము మనము ఊహించలేనంత చిన్నదే కావచ్చు!చిన్నా రాయే సరిపోతుంది.నిరాకారముగా,శూన్యముగా నున్న భూమిని నింపాలంటే చిన్న దేవుని శబ్దము,మాట చాలు. గొల్యాతు మోసుకొచ్చినంత ఖడ్గము దావీదుకు అవసరం లేదు.దావీదు కోరకు శత్రువే తన సొంత ఖడ్గము మోసుకొచ్చాడు.మనమేమో ఓ మంచి పదునైన ఖడ్గము ఉంటె చాలు, తప్పక జయమే అనుకుంటాము.ఎర్రసముద్రం చీల్చడానికి మోషే చేతి కర్ర మాత్రమే చాలు(నిర్గమ-14:16;17:6,సంఖ్య-20:8). అరణ్యములో కొన్ని లక్షలమందికి నీళ్ల కోసం ఓ బండని కొడితే చాలు,మాట్లాడితే చాలు.
*న్యాయాధిపతులు-4:2,3,21~తొమ్మిది వందల ఇనుపరధాలు కలిగిన సీసెరాను చంపడానికి ఓ సామాన్య కుటుంబ స్త్రీ మరియు ఆమె చేతిలో పాలు,ఓ సుత్తి,గూడారపు మేకు ఒకటీ చాలు.ఒకవేళ యాయేలు కూడా అయ్యో ఇప్పుడు నా చేతిలో ఒక యుద్ధ ఖడ్గము ఉంటె బావుండేది అని ఎదురుచూస్థూవుంటే సీసెరాను చంపగలిగేది కాదు.
*కొన్ని సమయాల్లో మన చేతిలో ఓ చిన్న పని,ఓ చిన్న అవకాశం,ఓ చిన్న కార్యము,ఓ చిన్న మాట మాత్రమే ఉండొచ్చు...కానీ దానినీ మనము దేవుని ఆత్మతో దేవుని పేరిట చేస్తే దేవుడు జయం పొందుతారు. ఆ ఏటి రాయే, ఆ నున్నని రాయే సరిగ్గ శత్రువు నుదుట మీద గురిగా తగులుతుంది.పెద్ద రాయి కదా..బాగా దెబ్బ తగులుతుందేమో అని ప్రయత్నిస్తే మొదటికే ఎత్తలేము జాగ్రత్త!ఒకవేల ఎత్తినా అది అంత వేగంగా గురితో దూసుకెళ్లలేదు.
*చిన్న చిన్న వాటిని పోగొట్టుకోవద్దు,వాటివలన గొప్ప వాటిని జారవిడుచుకునే ప్రమాదం ఎన్నో రెట్లు ఎక్కువ.దావీదు తన తండ్రికి చూపిన విధేయత ఆ యుద్ధానికి తీసుకెళ్ళింది.(17:20)
*దేవుని మాట చిన్నదే కానీ వెలుగు కలిగింది.సమస్త సృష్టి కలిగింది.నీ చేతిలో,నీకు అందుబాటలో నీకు వాడుకైనా ఆయుధమే నీ బలము.
పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మీ గ్రహింపులో దీవించును గాక.ఆమెన్!🙇.
~StephyBlesseena.
Comments
Post a Comment