పరమగీతం 4 4 Your neck is built like a tower🗼of David.
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు.ఈ రోజు పరిశుద్ద లేఖనములోనుండి,పరమగీతం లో ప్రియురాలు సౌందర్య లక్షణాలలో ఒక భాగము ధ్యానించుదాము.
To Know and lean more of this Song of Solomon,please visit the link here పరమగీతం
జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధరము సమానము.
*Your neck is like the tower of David built with courses of stones; one thousand shields are hung on it – all shields of valiant warriors.
Song of Solomon 4:4 NET
*Your neck is like the tower of David, Built with rows of [glistening] stones, Whereon hang a thousand shields, All of them shields of warriors.
Song of Solomon 4:4 AMP
*Your neck is like the tower of David, built in rows of stone; on it hang a thousand shields, all of them shields of warriors.
Song of Solomon 4:4 ESV
*BSB,LSB,MEV..Versions----build with stones.
Stone🪨- Rock
పాత నిబంధనలో బండ లేక రాయి..లేక రాళ్లు రాళ్లకుప్ప ఒక సాక్ష్యానికి ప్రతీకగా,గుర్తుగా ఉపయోగించేవారు.
*ఉదాహరణకు లాబాను,యాకోబులు తమ మధ్య ఒక గుర్తు అనగా దేవుడే వారి మధ్య సాక్షి అని చెప్పడానికి,గుర్తుగా ఒక రాళ్లకుప్ప వేయించి ఆ కుప్ప మీద..ప్రమాణము చేసుకున్నారు.(ఆదికాండము-31:45-54).
*ఇశ్రాయేలీయులు యొర్దాను నదిదాటి నప్పుడు ఆ మహాద్బుతము గుర్తుగా ,ఒక సాక్ష్యముగా ఉండాలనీ ఓ 12 (గోత్రములకు ఒకొక్క)రాళ్లను ఆ నదిలోనుండి తీసి గిల్గాలులో వాటిని నిలువబెట్టారు.(యెహోషువా-4:20).
*యాకోబు తన తండ్రి ఇంటినుండి ప్రాణరక్షణ కోరకు లాబాను యొద్దకు వెళ్లుచున్న ప్రయాణములో...(ఆదికాండము 28: 18)తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.
*దేవునికి బలిపీఠమును నిర్మించునది కూడ రాళ్లతోనే.
*ఇశ్రాయేలీయులు కానాను యాత్రలో నున్నపుడు ఒక బండను చీల్చగా,పగులగొట్టగా వచ్చిన నీళ్లు తాగారు.దేవుడన్నారు,నేను ఆ బండ మీద మీకెదురుగా నిలువబడతాను.(నిర్గమాకాండము-17:6)
*మరల అదే బండతో మాట్లాడితే నీళ్ళు వస్తాయని దేవుడు చెప్పారు.(సoఖ్య కాండము-20:8)
*"నీ మహిమను నాకు చూపమని మోషే అడిగినప్పుడు,ఒక బండ మీద నీవు నిలువబడాలి,నేను ఆ బండసందులో నిన్ను ఉంచి..నిన్ను నా చేతితో కప్పి,నిన్ను దాటిపోవుదును నా వెనుక భాగమును నీవు చూస్తావు అని మాటాడారు.(నిర్గమకాండము-33:21,22)
* 1కోరింథీయులకు 10: 4.... ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.
* యెషయా 28: 16
ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.
*సోలోమను రాజు కట్టించిన దేవుని దేవాలయము కూడ మిక్కిలి వెల కలిగిన రాళ్లతోనే కట్టబడినది.(1రాజులు-7:10,11)
* రెల్లు అని అర్ధమిచ్చు సీమోను, పత్రోస్-పేతురుగా,అనగ బండగా మార్చబడినాడు.మొదట సీమోనును పిలిచినప్పుడే ప్రభువు చెప్పారు,నేను నిన్ను బండగా మార్చుతాను,ఆ బండ మీద నా సంఘమును కట్టుతాను అని.
* ఇంకా లేఖనములో ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి.ఒక నమ్మకమైన సాక్షికి,గుర్తుగా ఎన్నడు చెరగిపోనీ,అరిగిపోనీ,మార్చబడని స్వభావము కల్గిన రాత్రిని గుర్తుగా ఉపయోగించేవారు.
* పరమగీతములోని ప్రియురాలి మెడ-కంధరము కూడ ఇలాగే ..స్థిరముగా,గట్టిగా మలచబడి,చెక్కబడి,పదునుపెట్టబడిన సాక్ష్యముగా ,గుర్తుగా తన ప్రియునికి కనబడుతుంది.
* ఈ వచనంలో దావీదు కట్టించిన గోపురము,అనగ సీయోను పురము,లేద సీయోను కోట,యేబూసను కోట,... యెరూషలేము గోపురము కూడా అలాగే నిర్మించబడినది.
* మరింత లోతునకు వెళ్లి రాళ్లతో నిర్మించబడిన కట్టడము అనే వాక్యాన్ని మనము ఆలోచిస్తే ఇంకా బావుంటుంది.రాళ్ల అనుభవం ప్రతి భక్తుని,ప్రతి విశ్వాస వీరుని జీవిత చరిత్రలో తప్పక కనపడుతుంది.
* అబ్రహాము-25 ,యోసేపు-13,మోషే-80,దావీదు-13సంవత్సరముల అనుభవాలు కలవారు.ఒకొక్కరి అనుభవాలు వేరైనా వారి గురి మాత్రము ఒక్కటే.ఒకొక్కరిని ఒకొక్క విధముగా సిద్దముచేయడము దేవుని జ్ఞానము.ఒక మట్టి ముద్దను,రాతిని,కలపను చెక్కి అందమైన రూపములోనికి తీసుకునివచ్చే శిల్పకారి ఎంత జ్ఞానము కనపరచునో ,ఒక మనుష్య-శరీర సంబంధమైన మనిషిని దేవుని సంబంధమైన మనిషిగా మలచి,చెక్కదానికీ,దేవుడు ఎన్నో రెట్లు ఎక్కువైన జ్ఞానాన్ని కనుపరుస్తారు.ఆ జ్ఞానము మనుష్య గ్రహింపుకు అందదు.కానీ ఆ దేవుని జ్ఞానానికి లోబడేదే విధేయత మరియు విశ్వాసము.
* దేవుని జ్ఞానమే, యేసు రక్తములో కడుగబడి పరిశుద్ధునిగా,నీతిమంతునిగా మార్చబడిన ఒక వ్యక్తిని పరిపూర్ణునిగా నడిపిస్తుంది,దేవుని గురివైపునకు,ఆయన ఉద్దేశ్యములోనికి నడిపిస్తుంది.
* దావీదు ఇంచుమించు 13 సంవత్సరములు
అరణ్యాలు,అడవులు,ఆ గుట్టకు,ఈ గుట్టకు తిరుగులాడుతూ రాజైనసౌలు చేతి నుండి తప్పించుకోవాలనే మాటే,కానీ దావీదును అలాగున నడిపించినది దేవుడే.
* దేవుడు దావీదుకు ఆ అరణ్యయాత్రలో ఎన్ని నేర్పించినారో!
* దావీదు అలాగున రాళ్లలో,గుట్టల్లో,కొండల్లో నడుస్తూ,సంచారిస్తు,రాతివలె దృడముగా తయారయ్యడు.దావీదు హృదయము కూడా దేవుని మీద అలా రాతివలె స్థిరపరచబడినది.ఆ పోలికను,అంటే రాళ్లతో కట్టబడిన,నిర్మించబడినట్లుగా పరమగీతము లోని ప్రియురాలు కూడా రాళ్లతో దృడముగా,స్థిరముగా నిర్మించబడినది.
* నిజముగా మన జీవితముల్లో కూడా మనము నిర్మించబడాలి,మనము రాళ్ళలో కట్టబడినంత దృడత్వము సంపాదించాలి.పొట్టు వలె ఎగిరిపోవునంత తేలికగా కాదు,ఆకు వలె వణికిపోవునట్లుగా కాదు,కాగితమువలె చినిగిపోవునట్లుగా కాదు నీళ్ళ వలె ఎటు పల్లముంటే అటు జారిపోవునట్లుగా కాదు గాని,రాతి వలె,రాతి బండ వలె దృడముగా ,కదలక నిలుచు సీయొను కొండ వలె స్థిరపరచబడాలి.
*నమ్మకత్వము రాతివలె,విశ్వాసము రాతివలె,దేవుని మీద దృష్టి రాతివలె కదలచబడక,దృఢముగా ఉండాలి.
*మత్తయి 7:24 లో "నా మాటలు విని వాటిచొప్పున చేయుప్రతివాడును,బండ మీద తన ఇల్లు కట్టుకోని బుద్ధిమంతుని పోలియుండును".
*దేవుని వాక్యము చేత నడిపించబడే వ్యక్తి మాత్రమే తన జీవితాన్ని బండ మీద కట్టుకోగలడు.ఎందుకంటె దేవుని వాక్యము ఎంత స్థిరమో,ఎంత నిశ్చలమో,ఆ వాక్య దిశలో,ఆ వాక్యమార్గములో నడిచే వ్యక్తి నడవడిక కూడా అలాగే స్థిరము,అదే నిశ్చలము కలిగి ఉంటుంది.
*దేవుడే నీకు బండగా ఉండాలి.నీవు ఆయన మీద ఆనుకోని,ఆయనను నీకు బండగా చేసుకుంటే,దేవుడే నీకు ఆశ్రయమైన బండగా ఉంటారు.దావీదు తన కీర్తనలో 18:1,2 లో..యెహోవా నా శైలము,నా శృంగము,నా కోట,నా కొండ అని చెప్పుచున్నాడు .ఆయన నాకు దాగుచోటుగా,నేను దాగుకొనుటకు బండ సందుగా ఉన్నారని చెప్పగలడు,అలాగు నడిపించబడి,కట్టబడినాడు.మనము కూడా అలాగు వాక్యమనే రాళ్లతో కట్టబడితేనే దేవుడు మనకు ఆశ్రయమైన బండగా ఉండగలరు.దేవుని వాక్యమనే రాళ్లతో మన జీవితాన్ని కట్టుకోకపోతే,మనము ఆశ్రయము కోరకు వెదకునప్పుడు,ఆయన కాకుండ వేరే ఆధారాలను చూసి వాటినీ లేక వారిని ఆశ్రయించే అవకాశం ఉంది.అందుకే...
*యెషయా 30: 1,2
యెహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా వారు నన్ను అడుగక ఆలోచనచేయుదురు నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురు.వారు నా నోటి మాట విచారణచేయక ఫరోబలముచేత తమ్మును తాము బలపరచుకొనుటకు ఐగుప్తునీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు.
*అప్పుడు నిజానికీ ఆ అయిగుప్తు ఎలాగుంటుంది అంటే,యెషయా 36: 6
నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా; ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొనువారికందరికి అట్టివాడే.
*సజీవుడగు దేవుని కాక, వేరే దేనిని మనము నమ్ముతామో,ఆశ్రయించుతమో,దేనిని బట్టి మనము గర్వపడుతామో, చివరకు అది తప్పకుండ మనకు ఉరి అవుతుంది.
*మన జీవితాలను పరీక్షించుకుని,నిజముగా దావీదు వలె,పరమగీతములోని ప్రియురాలు వలె దేవుని మాటలను విని వాటిని గైకొనుచు,రాళ్ళతో అనగా బండ మీద నిర్మింపబడిన కట్టడము వలె,కదలక నిత్యము నిలుచు సీయొను కొండ వలె మనల్ని మనము కట్టుకుందాం! పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతారు.ఆమెన్.
~StephyBlesseena
Comments
Post a Comment