Hit at the Forehead.

మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద,శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు.

1సమూయేలు 17: 49
తన సంచిలో చెయ్యివేసి అందులో నుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయునినుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచొచ్చినందున వాడు నేలను బోర్లపడెను.

దావీదు గొల్యాతు నుదుటమీద గురి చూసి కొట్టడమనేది యాదృచ్ఛికం కాదు,ఏదో అలా పొరబాటనా ఆ రాయి గొల్యాతు నుదుట మీద తగులలేదు.
*Forehead-is the symbol of a person's ownership and a house of thoughts.
గొల్యాతు వంటి శూరుని ఎదురించి కొట్టాలంటే,ఇలా వెళ్లి అలా జయించలేము.కానీ దావీదు ఉపయోగించిన విధానమే మనకందరికి మాదిరి.ఎందుకంటే 17వ అధ్యాయము చదివినపుడు అలా జరిగింది అనే ముగింపుకి వస్తాం,కానీ 17లో ముగింపు వరకు కాకుందా..దావీదు యుద్ధభూమికి వచ్చేవారికి ఆలోచించండి.ఒకసారి 1 వ వచనము నుండి 39 చదవండి.అసలు నుడుతా మీద కొట్టాలి అనే ఆలోచన ఎందుకు ఎలా వచ్చింది?సరే,గోల్యాతు ధరించిన ఆయుధాలు ఎటువంటివి?
•1సమూయేలు 17: 5
-​అతని తలమీద రాగి శిరస్త్రాణముండెను, 
-అతడు యుద్ధకవచము ధరించియుండెను, ఆ కవచము అయిదు వేల తులముల రాగి యెత్తుగలది.
-17: 6 మరియు అతని కాళ్లకు రాగి కవచమును
-అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి యుండెను.
-17: 7​అతని యీటె కఱ్ఱ నేతగాని దోనె అంత పెద్దది; -మరియు అతని యీటెకొన ఆరువందల తులముల యినుము ఎత్తుగలది. 
-ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను.
 ఇన్ని రకాలైన ఆయుధాలు ధరించిన గొల్యాతును చంపడము అంత తేలికకాదు.ఇప్పటికే తలకు రాగి శిరస్త్రాణం ఉంది ,అలంటపుడు నా తలను ,నుదుటను కొట్టుట ఎలా సాధ్యమైనది?
*దావీదు ఏదో  ప్రజలందరిలో పేరు పొందుటకు కాదు,రాజు ఇచ్చె బహుమతులు పొందుటకు కాదు గాని శత్రువు అయిన ఆపవాది గురిని పసిగట్టినాడు.ఆ గురిని చెదరగొట్టాలంటే ,అపవాదిని చంపడానికి ఆదిలోనే దేవుడు మనుష్యునికిచ్చిన ఆయుధం,ఆదికాండము 3:15.మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.
*తల అనేకమయాన ఆలోచనలకు,తీర్మానాలకు అధికారానికి సూచన.శత్రువు ఎంతటిదైనా,ఎంతటి వాడైనా కాని వాని తల మీద కొట్టి,వాణి అధికారము చెదరగొట్టే బలము మనకు ఎప్పుడో ఇవ్వ బడినది.అయితే ఆ తలలో మన పట్ల వాణి ఆలోచన,కారణము ఎమో గ్రహించాలి.అంతేగాని ఉన్నపాటూన పరుగెట్టుకుని పోయి అమంతముగా వానిని పట్టుకుని చంపాలంటే కుదరదు,వాణికి కూడా ఎన్నో ఆయుధాలు ఉన్నాయి.ఎన్ని ఆయుధాలు ఉన్నా మన మడిమే అదే మన నడక(దిశ)మీద మాత్రమే కొట్టే అధికారం ఉంది.ఆ చిన్న దానికే మనము పరిశుద్ధ దేవుని మార్గం నుండి తొలగిపోతున్నాం.
*ఫిలిషీయుడైన  గొల్యాతు వచ్చిన దగ్గరనుండి ఇశ్రాయేలీయులను మాత్రమె కాదు, జీవముగల దేవుని   సైన్యములను దేవుని ధిక్కరించడం,తిరస్కరించడం చేసాడు.ఆది ఎంత చులకనైన భావన.మీరందరు సైన్యముగా రావద్దు,మీలో ఒకడు మాత్రమే రండి నాతో పోరాడడానికి,అంటే దేవుని సైన్యములంటే అతనికి ఎంత చిన్నచూపు.అందుకే ఆ ఆలోచనలను కొట్టడానికి దావీదు వడిసెల తో గురి పెట్టు వాని నుదుటను కొట్టాడు.
*యుద్ధభూమికి రాగనే దావీదు ఆ శత్రువు దృక్పదము, దిశ, గురి, ఉద్దేశ్యము,మనస్సు,కారణము గ్రహించాడు,కనుకనే దావీదు మాత్రమే ఆ గోల్యాతును చంపగలిగాడు.
*అందుకే దావీదుకు ఆ తల కొట్టడానికి ఖడ్గము పనికిరాలేదు,ఈటే పనికిరాలేదు,యుద్దకవచము పనికిరాలేదు.వేగముగా,గురిగా దూరమునుండే వాని తల కొట్టడానికి,ఆ తలకు రాగి శిరస్త్రాణము ఉన్నా గాని ,దానిని దూసుకుని పోవురీతిగా ఒక చిన్న రాయి తన వడిసెల చాలు.
*దావీదు వడిసెలతో నుదుటను కొట్టినపుడు మాత్రమే కాదు,అసలు దావీదు వానిని చంపడానికి గల కారణమే గొల్యతును సగం బలహీనపరచింది.ఎందుకంటె 40 రోజులు ఉదయము సాయంత్రము వారి దేవుని తిరస్కరిస్తుంటే ఆ 40 రోజుల్లో వారు గాని,వారి రాజుగాని,వారి యుద్ధశాలరు గాని ఏమి ప్రతిస్పందించలేదు.అలాంటిది ఈ బాలుడు తనను చంపదానికి వస్తున్నాడంటే అదే గొల్యాతు మరణం.కారణం ఇశ్రాయేలులో ఎవరు గ్రహించలేదు,వాడు తమను మాత్రమే గాదు,తమ దేవుని కూడా దూషించి,తిరస్కరిస్తున్నాడని.యుద్ధభూమి లోనికి వచ్చి ఆ గొల్యాతు మాటలు వినగానే దావీదు నోట వచ్చిన మాట-"జీవముగల దేవుని సైన్యములను,జీవము గల దేవుని తిరస్కరించు ఈ ఫిలిష్తీయుడెంతటి వాడు?"వాణి ఆయుధాలు,బలము,ఆజానుబాహమైన దేహము ఇవేవీ దావీదును ఆలోచింప చేయలేదు కానీ,తాన దేవుని దూషించే ఆపవాది మనస్సు,అపవాది చూపు ఆ గోల్యాతులో కనిపించింది.అందుకే వాని తలకు  గురిపెట్టి నుదుటను కొట్టి,బలహీనపరచి,పరుగెత్తివెళ్లి వాని ఖడ్గముతోనే వాని తలను తెగనరికేసాడు.
*జీవముగల దేవుడు అను మాట వినగానే గొల్యాతుకు అర్ధమైపోయింది,తనకు అంతము వచ్చేసింది అని,అపుడే కృంగిపోయాడు.ఆ బలహీనతమీద దావీదు రాతితో కోటగా దిమ్మతిరిగిపోయి,తన చుట్టు ఏమి జరుగుతుందో కూడా గ్రహించలేనంతగా తన ఆలోచన శక్తి కొట్టివేయబడింది.అంతలా బలహీనమైన గొల్యాతును చంపదము ఇంకెంత?కాని దావీదు అంతటితో ఆగిపోలేదు ఆ తలనూ కూడా నరికేసాడు.
*ఇశ్రాయేలీయులు ఇంత చిన్న పని చేయలేకపోవడానికి కారణం ముందు వారు ఆ శత్రువు motive  కారము,గ్రహించలేదు,వెల్లి చంపే ప్రయత్నము,ఆలోచన చేయకుండ వానిని చంపితే ఇలాంటి బహుమతులు కలుగుయాయని ఊహిస్తు 40 రోజులు అలా గడిపేశారు.
*ఈ మాటలు చదువుతున్న దేవుని బిడ్డా,నీ జీవితంలో కూడా ఇలాంటి గొల్యాతులు ఎన్నో రాకాలుగా,విధాలుగా నీకు ఎదురుపడి నిన్ను కించపరచి,నిన్ను చంపాలనే,ఒడిపోవునట్లు చేయడానికే రావచ్చు ,కానీ నీవు ఆ గొల్యాతును ఎలా ఎదుర్కొంటునావ్? ఇశ్రాయేలీయుల వలెనా,లేక దావీదు వలెనా?దావీదు వాలె ఎదురుకొంటెనే వానిని బలహీనపరచగలవు.900 ఇనుపరాధాలు కలిగిన సీసెరాను చంపాలంటే ముందు పాలిచ్చి,నిద్రపోవునట్లు చేయాలి,లేదంటే ఆ సీసెరాయె యాయేలును చంపగలడు.(న్యాయాధిపతులు-4:19,21,5:25).
 నీ జీవితములో నీకుదురైనా ఆపవాధి ఎంత బలముగా కనపడినా,నీవు జయింపలేనంత భారీగా కనపడిన గానీ నీవు వాని తలనూ కొట్టగలవు.ఆ అధికారం ఉంది,మరియు దేవుడే ఆపవాధితో అన్నారు "ఆది-స్త్రీ సంతానం నిన్ను తల మీద కొట్టునని"
*ముందుగా ఆ తలను ఆలోచనను నీవు గ్రహించాలి.ఆ తర్వాత జీవముగల దేవుని నామము ఉచ్చరించాలి,అప్పుడే వాని ఆలోచన బలహీనమౌతుంది.ఆ తరువాత నీవు వాని తలను తెగనరికివేయాలి.నుడుతాను కొట్టను కదా చాలు,అని సరిపెట్టకూడదు.తలను కూడా ఖండన చేయాలి. ఆ సాతాను తంత్రములు,ఆలోచనలు పసిగట్ట,గ్రహించే పరిశుద్ధమైన దేవుని సన్నిధి ,ఆయన మనసు,ఆయన ఆత్మను సంపాదించుకుందాం.పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతారు.ఆమెన్!
~StephyBlesseena

Comments

Post a Comment

Popular posts from this blog

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

JESUS SAW THEM STRUGGLING! By Stephy Blessena

Our LORD, walking on the Waters-నీళ్ల మీద నడచి వస్తున్న ప్రభువు-BY STEPHY BLESSEENA