I will fight-నేను పొట్లాడుదును.

ఇతరుల మీద ఆధారపడే మనస్సు మన వ్యక్తిగత జీవితములోని గొల్యాతును చంపడానికి ఉపయోగ పడదు.
మన అనుదిన జీవితములో ఎదురుపడే ఓ చిన్న సమస్య.మరో విధముగా చెప్పాలంటే ప్రతి దినము మనము ఓడిపోయే యుద్దము,ఇదే.
మన సమస్యలో,మన బాధలో,మన దుఃఖంలో,గొల్యాతు  అనే శోధనలు-యుద్దములు ఎదురైనపుడు ఎవరైనా వచ్చి మన పక్షముగా నిలబడాలి,మనకు సహాయపడాలి,అని మనము ఎంత ఆశతో కోరుకుంటాము.కాని మనమే ఆ సమయములో నిలువబడాల్సిన విషయాన్ని మార్చపోతునము.
✝️లేఖనానుసారముగా మనము పిరికివారము కాదు,ఇంద్రియనిగ్రహముగల శక్తితో ప్రభువు మనలను నింపారు.
👉2తిమోతికి 1: 7
దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల (స్వస్థబుద్ధియుగల ఆత్మనే) ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మనియ్యలేదు.
*ఆ ఏలా లోయలో ఇశ్రాయేలీయుల పరిస్థతిని మనము ఆలోచిస్తే వారు ఇలాంటి లోపమువల్లనే,తమ శత్రువులైన గొల్యాతును ఎదురించి చంపలేకపోయారు.వారికి తెలియని యుద్దాలా?వారికి తెలియని జయలా?
*కానీ ఎప్పటివలెనే సైన్యమంతా కలిసి శత్రువు మీద దాడి చేసే పరిస్థితి కాదిప్పుడు.వారి ముందరకు వచ్చిన సమస్య ,వారిలో ఎవరైనా ఒక్కరే సైన్యమంతటి పక్షముగా యుద్దం చేయాలి.నిజానికీ అది ఎంత చిక్కుగానున్నా సమస్య.యుద్ధమనగానే అందరిలో,అందరితో,కలిసి చెయ్యగలరు,ఎలాంటి వారినైనా జయించగలరు,ఆ సామర్ధ్యము వారికెంతో ఉంది.
*ఒకవేళ గొల్యాతు ఏ శరతు పెట్టకుండా,యుద్దం చేస్తే ఇశ్రాయేలీయులే గెలిచేవారు,గెలవగలరు,దావీదు రావాల్సిన పని లేదు.ఆది అందరు కలిసి చేయాల్సిన యుద్ధము కాదు,ఎవరైనా ఒక్కరే దేవుని పక్షమున నిలబడాల్సిన యుద్ధము.ఆ ఏలా లోయలో దేవుని వారిని చూస్తున్నాడు.
*మన జీవితంలో కూడా...ఇలాంటి పరిస్థితులే ఎదురవుతుంటాయ్,ఒకటీ కాదు,రెండు కాదు ఎన్నో ఎదురువుతాయి,అయితే వాటిని మనము ఎలా ఎదుర్కొంటాము?
*కొన్ని సమయాల్లో మనకు మనమే నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.దేవుడు మనల్ని చూస్తు కనిపెట్టుతుంటాడు,మన పక్షముగా ఎవరు రారు.మనమే నిలువబడాలి అయితే అందుకు చాలినంత నిశ్చయత,ధైర్యాన్ని దేవుని మాట వలన  పొందగలము.
*మనమేమో ఎవరో వస్తారు,ఎవరో మన పక్షముగా లేరు అని ఎదురుచూస్తూ...ఆ సమయాన్ని పోగొట్టుకుంటాము.ఇంకా దేవుడు నాకు కచ్చితమైన దర్శనము,ప్రత్యక్షత ఇవ్వాలి,అసలు దేవుడే నాతో డైరెక్ట్ గామాట్లాడాలి,అబ్రహాముతో,ఇస్సాకుతో,యాకోబుతో,దావీదుతో,మోషేతో మాట్లాడినట్లు నాతో మాట్లాడితేనే ముందుకు అడుగు వేస్తాను అని భీష్మించుకుంటాం.
అలాగు ఎదురుచూడడము,కనిపెట్టడము మంచిదే !!!అలా మాట్లాడుతారు దేవుడు.కానీ అలాంటి దర్శనము,ప్రత్యక్షత పొందుటకు సరైన భక్తి జీవితాలు మనలో ఉండాలి కదా!
*ఒక చిన్న మాటనే,ఆయన ఉద్దేశించినట్లుగా గ్రహించలేని మనము,ఇక కొండపై మోషేతో మాట్లాడిన ప్రత్యక్షతను అర్ధము చేసికొనగలమా?ఎదైన ఒక తప్పును సరిచేసుకొనమని మాట్లాడితే ఆ తప్పును విడిచిపెట్టలేక సమర్ధించుకునే మనము ,అబ్రహము వలె ,నీ దేశమును,నీ బoధువులను,నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించే దేశమునకు వెల్లుమని చెప్పిన దర్శనానికి ఎంత వరకు లోబడగలము?(ఆదికాండము-12:1)ధర్మశాస్త్రము విషయములో నిoదారహితుడుగా,నిష్టగా(అపో.కార్యము-26:5,గలతీ-1:14,ఫిలిప్పి)-3:6 నున్న పౌలును దర్శించి- నీవు పోరాడునది సరి కాదు,రివర్స్ లో పోరాడుతున్నావ్ అని చెప్పిన దర్శనానికి పౌలు వలె "ఆ దర్శనమునకు ఆవిధేయుడిని కాక"అని అన్నట్లుగా, మనము మన అనుభవాలను,
ఎన్నో సంవత్సరాల సరి కానీ మార్గాన్ని,పద్దతులను విడువగలమా?దేవుని వాక్యము యొక్క  భావము,ఉద్దేశ్యము,గురినే అర్ధము  చేసికొనలేని మనము దర్శన భావము,ప్రత్యక్షత భావనను గ్రహింపగలమా?దేవుని వాక్యాన్నే,ఆయన వాక్యానికే సరిగా సమర్పణను,త్యాగమును కనుపరచలేమే మనమా దేవుని ముఖాముఖి సందర్శనను ఎదుర్కొనగలము?
*జీవితాని,క్రియలను ఆయనకు అనుకూలముగా మార్చుకుని, ప్రభువా! నీవు నాతో స్పష్టముగా మాట్లాడితేనే ,లేకపోతె నేను ముందుకెళ్లలేను అంటే అది దీనమనస్సవుతుంది.ఆయనకు అనుకూలమైన జీవితము లేకున్నా ఆయనే మాట్లాడితేనే ...అనేది మన సాకు అవుతుంది. అవును దేవుడు మాట్లాడుతారు,మాటలాడే  వరకు మనము ఎం చేస్తున్నట్లు?ఆది త్యాగము కాదు,ఆది సమర్పణ కాదు, పిలిచిన తర్వాత మనమేంటి ! ఎవరైనా వచ్చి దేవుని పక్షము నిలబడతారు. యెహోషువాను ఇంకా పిలువకముందే ,మోషే నాయకత్వములో నేర్చుకుంటూ,తనను తాను సమర్పించుకుని,ఆయన పనిలో భాగమయ్యాడు.ఇశ్రాయేలులంతా మోషేకు విరోధముగా సనిగిన యెహోషువా సనగలేదు.ఎందుకంటే తనలో ఆ సమర్పణ,త్యాగాలు ఉన్నాయి.అందుకే మోషే అంతటి గొప్ప నాయకుడు,భక్తుడు తర్వాత,మోషే పిల్లలు కాకుండా దేవుడు యెహోషువను ఏర్పరచుకున్నాడు.
*దావీదు ను తన తండ్రి యుద్ధము చేయడనికి కాదు పంపింది,యుద్దానికి అన్ని విధాల సిద్దపడి వెళ్ళలేదు దావీదు.తన సోదరుల యోగక్షేమాలు తండ్రికి చేరవేసే రాయబారమే దావీదు చేయవలసింది.అలాగని దావీదుకు దేవుడు కలలో ఏమి చెప్పలేదు "నువ్వెళ్లి గొల్యాతుతో యుద్దము చేయాలి సిద్దపడు" అని.
*యుద్ధభూమిలోనికి వెళ్ళగానే..ఆ సున్నతి లేని ఫిలిష్ఠీయుడు ,జీవముగల దేవుని సైన్యములను తిరస్కరిస్తుంటే మౌనముగా చూస్తూ ఉండలేకపోయాడు.అందునిమిత్తమే తను అక్కడికి పంపబడినాడని ఓ లోతైన గ్రహింపు,ఆ గ్రహింపుకు చురుకైన విధేయతా-విశ్వాసాన్ని కనుపరిచి ప్రభువు మనస్సెరిగిన వాణిగా ,ఆయన చిత్తానుసారిగా ఆ ఏలా  లోయలో ,ఇశ్రాయేలులో దేవుడునాడని ఋజువు చేసాడు.గ్రహింపుకు చురుకైన విశ్వాసము,చురుకైన విధేయత ఎంత అవసరము.ఎంత గ్రహింపు కలియుండినా చురుకైన విశ్వాస-విధేయతలు లేకపోతె ఆ గ్రహింపు శూన్యమే.
*రోమా 12:1లో బహిరంగముగా విశ్వసించు ప్రతివ్యక్తి తమ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలని బైబిల్ చెప్తుంటే..మల్లీ ప్రత్యేకoగా దేవుని పిలుపు ఏంటి?ప్రేమతో మన జీవితాలు, ప్రాణము పెట్టిన ప్రభువుకు సమర్పించుకుందాము.దావీదు వలె నిలువబడి ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడితే,ప్రభు సహాయముతో పొట్లాడుదాం,పోరాడుదాం,ఆయన నామమహిమార్ధమై.
May God Bless You 🙏 Amen!!!
~✍️StephyBlesseena

Comments

Popular posts from this blog

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

JESUS SAW THEM STRUGGLING! By Stephy Blessena

Our LORD, walking on the Waters-నీళ్ల మీద నడచి వస్తున్న ప్రభువు-BY STEPHY BLESSEENA