నీ స్థానము క్రీస్తులోనే-Your Place is in Christ.
యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారము ఆయనకే! నీ స్థానము క్రీస్తులోనే.ఈ రోజు నువ్వు క్రీస్తులో నిలిచియున్నావు. నీవునిలిచి యుండటానికి, నీ అనుభవానికీ మధ్య తేడాను గుర్తించటం మర్చిపోకు. నీవు నిలబడింది క్రీస్తులోనే నీ అనుభవం నీ ఉద్రేకంలోనే. జాన్ బనియన్ అంటాడు "మన ఉద్రేకాలు డబ్బులు ఖర్చుపెట్టడం లాంటిది; మన జేబులో ఉన్నంత వరకే.అది చాలా ఎక్కువలా అనిపిస్తుంది గానీ యథార్ధానికి తక్కువే; మనకు ముందుగా పరుగెత్తిన వానిలో మనం (విశ్వాసముంచటం)నిలబడటం, బ్యాంకులో మనకున్న డబ్బు లాంటిది. అది మన అనుదిన వ్యయంచే ప్రభావితం కాదు. నేను కొన్నిమార్లు సంతోషంగా ఉంటాను, కొన్నిమార్లు వడిలిపోయినట్లుంటాను. విస్తారంగా బడలిక చెందుతాను,నరాల సత్తువ కోల్పోయినట్లుంటాను, కానీ వీటిని లెక్క చెయ్యను, నేను శ్రమలు గల చీకటిలోయ గుండా ప్రయాణిస్తున్నా. నా కృంగుదల అస్థిరమైనది. నా స్థానం చెక్కు చెదరనిది, ఎందుచేతనంటే నాకు ముందుగా పరుగెత్తిన (యేసు) వాని యందు స్థిరపర్చబడినది. ఆయన నా యాజకుడు, నా రక్షకుడు, నా శిరస్సు, ఆయనలోనే నేను దేవుని ఎదుట నిలువబోతున్నా...
Comments
Post a Comment