పాపము
పాపము అను పదము క్రైస్తవుని భక్తి జీవితములో తరచుగా వినబడు పదము.అసలు పాపము అనగా ఏమి?దేనిని పాపము అంటారు?
పాపము అనగా వాడుకలో ఉన్న పదము "గురి తప్పుట"
దేవుడు మనకు విధించిన విధిని గురి తప్పుట,అనగా దానిని తప్పుట.పాపమునకు "దోషము" అను అర్థము వచ్చు మరియొక పదము కూడా ఉంది.అవిధేయత,ఋణము,అపరాధము,అతిక్రమము,వంకర మార్గము,కీడు,ఆటంకము,బుద్దిహీనత అను పాదములు ఉన్నాయి.
■దేవుని గూర్చి తలంచినయెడల -పాపమనగా "ఆయనకు విరోధముగా తిరుగబడుట లేదా ఆయన యెడల అవిధేయముగా ప్రవర్తించుట".
■ఆజ్ఞలను గూర్చి విచారించినయెడల- పాపమనగా"ఆజ్ఞను అతిక్రమించుట లేదా అపరాధము చేయుట".
■ఇతరుల విషయములో చూడగా-పాపమనగా"వారికొక కీడుగా,ఆటంకముగా నున్నది,మనలను గురించి చూడగా ఆ ఉద్దేశ్యమును తప్పించునదిగా ఉన్నది.
■మన స్వంత జ్ఞానమును బట్టి చూడగా-పాపము బుద్దిహీనత అని ఒప్పుకొనవలెను.చేయవలసిన వాటిని చేయకపోవుటే రుణమని యెంచి ఏ విధముగా చూచినా అది దేవుడు మన మేలు నిమిత్తము ఏర్పాటు చేసిన దానికి భిన్నముగా వుంది ఆయన ఏర్పాటును చేరునదై యుంటుంది.
పాపము అనగా ఏమి? Lewis Sperry Chafer తన Systematic Theology లో "సర్వజ్ఞానియైన దేవుడు నియమించిన పరిధిలో ఆయన సృష్టి అవిశ్రాoతమైన అసమ్మతితో మెలుగుటయే పాపమని నిర్వచించారు.
*సాధారణంగా చెప్పాలంటే -పాపమనగా "దేవుని స్వభావమును కలిగియుండకపోవుటయే"
●పాపమును కొలుచు ప్రమాణము- దేవుని పరిశుద్ద స్వభావమే.
●దేవుని స్వాభావమును గూర్చి సరియైన అవగాహన మనకు లేనియెడల పాపమును గూర్చిన అవగాహన మనకు ఎప్పటికినీ కలుగదు.
●దేవుని అర్దము చేసుకొనగల ఒకే ఒక మార్గము ఆయన వాక్యమును అభ్యసించి ధ్యానించుట ద్వారా ఆయన తనను గూర్చి ఏమి చెప్పునో దానిని వినుట.
Comments
Post a Comment