వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN



యేసుప్రభువారి పరిశుద్ధ నామములో దేవుని ప్రియులైన వారందరికీ మా హృదయ పూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాము.

దేవుడు ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోనికి తీసుకు వెళ్ళడానికి గల కారణములలో మొదటిది ....ఆ  అమలేకీీయల పాపము సంపూర్ణము కానందు వలన ,ఇశ్రాయేలీయులను ఒక పరిశుద్ధమైన జనాంగముగా చేయాలనీ...రెండవ కారణము వారికి క్రమ శిక్షణ నేర్పడానికి!


ఆ వాగ్దన దేశము పవిత్రమైనదే కానీ అందులో  నివసిస్తున్న ప్రజలు అపవిత్రమైన క్రియలు చేయుటవలన ఆ దేశము అపవిత్రతతో నిండిపోయింది.ఆ అపవిత్రత  ఇశ్రాయేలీయులలోనికి ప్రవేశించకూడదు.అందుకని దేవుడు...ఆ అపవిత్రత లోనుండి వేరు చేయడానికే....సమస్త భూమ్మీద ఓ గొప్ప కరువు రప్పించి దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చాడు.
అప్పటికే యాకోబు కుమారులలో రూబేను,యూదా,షిమ్యోను,లేవి,దీన,.....ఆ దేశపు అపవిత్రత కొంచెం కొంచెం గా...ప్రవేశిస్తుంది .రూబేను తన తండ్రి ఉపపత్నియైన బిల్హా
 విషయములో,దీనా ఆ దేశ సంచారము చేసి చూడటములోను,షిమ్యోను లేవీయులు ఆ షెకెము కు చేసిన నాశనము విషయములో ,యూదా కుమారుల విషయములో,యోసేపు మీద పగబట్టి అమ్మివేయు విషయములో ..ఇలాంటి కార్యాలు చాల ఉన్నాయి,వీటన్నిటిలో  దేవుని మీద ప్రేమ గాని,దేవుని యందలి భయము కానీ,దేవుని యందు భక్తి గాని వారిలో ఏ  మాత్రమూ కనబడుటలేదు.అందుకని దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు.ఒక వేళా దేవుడు కలుగచేసుకోకపోతే  కరువు రాగానే...వారికి అనుకూలముగా ఉన్న ఎదో ఒక ప్రాంతానికి వెళ్లిపోయేవారే,
.*ఆదికాండము 45:10. నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొఱ్ఱెల మందలును నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును.
యోసేపు తన దగ్గరే ఉంచుకున్నాడు ,వారిని కట్టడి చేయడానికి, నీతియందు శిక్ష చేయడానికి,ఉపదేశించడానికి వారిని తనకి సమీపముగా ఉంచుకున్నాడు,తన సహోదరుల గురించి బాగుగా ఎరిగినవాడు,మీరు మార్గములో కలహపడకూడదు,{ఆదికాండము 45:24. అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా - మార్గమందు కలహపడకుడని వారితో చెప్పెను.}
యోసేపు  దేవుని ఆత్మ గలవాడు,{ఆదికాండము 45:38. అతడు తన సేవకులను చూచి ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని యనెను}దేవుని సహవాసములో  నుండినవాడు  కాబట్టి తాను బ్రతికినంత కాలము తన సహోదరులను కనానులో ఇశ్రాయేలీయులు యోసేపుకు సమీపముగా జీవించి...విశ్వాసమును.మాదిరి ని నేర్పుతూ,తన సహోదరులకు కాపరిగి ఉన్నాడు.కాబట్టే అంత  అవిశ్వాసులైన వారు, నిర్గమాకాండములో చూస్తే వారిలో ఎంత విశ్వాసము కనబడుతుందో!ఎంత విశ్వాస వీరులైనారో! ఎంత విస్తరించారో !అబ్రహాముకు చెప్పిన వాగ్దానం వారిలో నెరవేరునంతగా విశ్వాసము కనుపరిచారు.ఒకవైపు ఐగుప్తీయులు ఇశ్రాయేలు సంతానాన్ని అడ్డగిస్తుంటే ,ఆ శత్రు కార్యానికి  వ్యతిరేకముగా విశ్వసించారు, వారు దేవుని మొరపెట్టారు,దేవుని కొరకు వేచియున్నారు.యోసేపు అదే నేర్పాడు ...."మన పితరుల దేవుడు నిశ్చయముగా  వస్తాడు,మనల్ని వాగ్దాన దేశానికి తీసుకునివెళ్తాడు."
క్రమశిక్షణలో...పెంచడానికే దేవుడు వారిని ఐగుప్తులోనికి నడిపించాడు. ఆ కనాను
 అంత అపవిత్రత గల దేశమది . ఆ ప్రజల వలన ఇశ్రాయేలీయులు కూడా చెడిపోయే అవకాశము ఎంతైనా ఉంది.   దేవుని కోసము, మనము అవిశ్వాసములో పడకుండా ఉండటానికి మన స్నేహితులు, వారు ఎంతటి ప్రాణ  స్నేహితులైన మనము వారినుండి మనలను విడిపించుకోవాలి.

6. నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమా రుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని7. భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవ తలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల8. వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను.

ప్రియ దేవుని బిడ్డలారా...మనల్ని విశ్వాసములోనుండి,సహవాసములోనుండి,దేవుని వాక్యము లోనుండి తొలగించడానికి పూనుకుంటే....ప్రయత్నిస్తే..వారెవరైనా ఎలాంటి వారైన మనం వారిని కట్టడి చేయాలి.

                                   నీవు నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండు తిని ...నాకు ద్రోహం చేసావు.సమ్సోను చావగోరినాడు ,ఎందుకు?దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి ఓ సాతాను మనిషికి లొంగిపోయినందువల్లన ఇప్పుడు తనకు ఎదురైన ఆ శ్రమ నుండి తప్పించుకోవడానికి...చేతకాక  చచ్చిపోవాలని కోరుతున్నాడు.ఆ దెలీలా చేతిలోనుండి తప్పించుకోకుండా , చనిపోవాలని చూస్తున్నాడు.ఎంత దిగజారిపోయినాడు చూడండి.ఆదాము కూడా ..దేవునినైన విడిచిపెట్టడానికి సిద్దమైనాడు కానీ భార్య మాట తప్పలేదు.అపవాది మన బలహీనతను ఆధారం చేసుకుని రకరకాలైన పరిస్థితులలో మనలను ఇరికిస్తుంది...మనలను ఇరికించేది అపవాది కాదు మన బలహీనత.అది మన అవిశ్వాసం కావచ్చు ,అది మన అవిధేయత కావచ్చు,మన భక్తిహీనత కావచ్చు ....మనం ప్రాణం విసిగి...ఆ దేవుని చిత్తము నుండి తొలగిపోయేంతగా మనలను ఇబ్బంది పెడుతుంది.ఇలా విసిగిపోయినపుడే మనము సమ్సోను వలెనె విడుదలను గూర్చి ఆలోచించకుండా..దాని చేతిలో ఓడిపోవడానికి అన్నివిధాలా సిద్ధమౌతాము.


                                అపవాది ఎప్పుడు కూడా తనంతట తానుగా మనల్ని ఓడించలేదు..మనకై మనమే ఆ నిర్ణయము తీసుకునేంతగా మనలను బలహీన పరుస్తుంది.అపవాది మనల్ని ఎంత తప్పుత్రోవను నడిపిస్తాడో చూడండి.ప్రియా దేవుని బిడ్డా !మనము దేవుని చేత ఏర్పరచబడినవారము.మనము పరిస్థితులచే కానీ,ఎలాంటి అవాంతరాల ద్వారా కానీ ఓడిపోగూడదు.నిన్ను పరిస్థితులు గెలువకూడదు.అందుకోసమే దేవుడు ఇశ్రాయేలీయులకు గొప్ప కరువు రప్పించి వారిని వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోనికి తీసుకెళ్లాడు.అక్కడ వారు ఐగుప్తీయులతో కలుస్తామనినఁగాని ఐగుప్తీయులు వారిని కలువనీయరు.అందుకే వారిని ప్రత్యేకపరచడానికే దేవుడు వారిని ఆలా నడిపించారు.ఆలాగున దేవుడు వారికి అన్నివిషయాలలో క్రమశిక్షణ నేర్పుతూ వచ్చారు.వారికి ఎదురైన  ఆ గొప్ప కరువు క్రమశిక్షణ కొరకే!నీ జీవితములో దేవుడు అనుమతించే ఎలాంటి శ్రమయైనా ఇరుకు ఇబ్బందియైనా అది నీ క్రమశిక్షణ కోసమేనని గ్రహించి ప్రభుని స్తుతించు !



దేవుడు ఈ మాటలన్నీ మన వినికిడిలో దీవించును గాక!ఆమెన్ ఆమెన్ ఆమెన్ !
                                                             
                                                                              వాక్య సందేశము : పాస్టర్ స్టీఫెన్

Also Listen to                      YouTube/Part-1

.

Comments

Post a Comment

Popular posts from this blog

JESUS SAW THEM STRUGGLING! By Stephy Blessena

Our LORD, walking on the Waters-నీళ్ల మీద నడచి వస్తున్న ప్రభువు-BY STEPHY BLESSEENA