JESUS SAW THEM STRUGGLING! By Stephy Blessena
BERACHAH BIBLE STUDY యేసుప్రభువు వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ పరిశుద్ధమైన వందనములు తెలియపరచుచున్నాము.ఈ ప్రత్యేకమైన సమయములో దేవుని లేఖనములలోనుండి మార్కు సువార్త-6: 48 "అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి, వారిని దాటిపోవలెనని యుండెను. " వాక్యాన్ని ధ్యానిద్దాము! ఆయన సముద్రములో కష్టముగా ప్రయాణిస్తున్న వారిని దూరమునుండి చూచే త్వరపడి వస్తుంటే..వారాయనను గ్రహించలేదు.వారు ప్రభు చెప్పిన మాటను బట్టియే బయల్దేరారు ,కానీ వారిని సముద్రము పరీక్షించింది.ఆ అలలు ,ఆ తుఫాను ,ఆ గాలులు వారిని బలహీనపరచినవి.అందువలన ఆ తుఫానుకు,అలలకు ఎదురుగా దోనెను నడుపడము,వారు వెళ్ళవలసిన దిశలో దోనెను నడపటానికీ ఎంత కష్టపడుతూ ,ప్రయాసపడుతున్నారో !ఎందుకంత కష్టము?జీవితములో దేనికైనా ఎదురీదడం చాల కష్టము!పరిస్థితులకు రాజీపడిపోయి..ఆ పరిస్థితులలో కొట...