WATCHING & WAITING ~StephyBlesseena





                         
              WATCHING OVER THE FLOCK
                WAITING OVER THE NIGHT




                                            ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు
                        పొలములో ఉండి రాత్రివేళ తమ  మందను కాచుకొనుచుండగా.....
                                   ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను;
             ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి.
                                        లూకా సువార్త 2:8,9.
గొర్రెలు కాపరులు అంటే చాల వరకు చాల బలహీనులు మరియు బీదవారు అనే ఆలోచనే ఎక్కువగా మనకు కలుగుతుంది.కానీ ఈ ప్రత్యేకమైన  సమయములో  దేవుని మనకు తెలియపరచు మాటలను ధ్యానము చేద్దాము!



గొర్రెలు కాపరులు అంటే చాల వరకు చాల బలహీనులు మరియు బీదవారు అనే ఆలోచనే ఎక్కువగా మనకు కలుగుతుంది.కానీ ఈ ప్రత్యేకమైన  సమయములో  దేవుని మనకు తెలియపరచు మాటలను ధ్యానము చేద్దాము! దేశములో అంత మంది ఉండగా,అంతమందిలో భక్తిశ్రద్ధలు కల్గి,ధర్మాశాస్త్రము విషయములో కడు నిష్ఠ కలిగినవారు,ధర్మశాస్త్రోపదేశకులు ,లేవీయులు,యాజకధర్మము జరిగించువారు  అనేకులున్నారు కదా!మరి ఈ గొర్రెల కాపరులకే మొట్టమొదటిగా ఆ శుభవార్త తెలియపరచబడడము ఏంటి?అంత మాత్రమే కాదు గాని పరలోకపు భాషను అర్ధము చేసికొనడము ఏంటి?
                       *గొర్రెల కాపరులు సింహా ధైర్యము గలవారుగా నున్నారు.
                       { సింహమువలె ధైర్యముగా నుందురు.సామెతలు 28 :1 }
.                     *ఎదురుచూచు బలము గలవారు.
                     {ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు.యెషయా 40 :31 
                     *వారు మెలకువ గలవారు,చురుకు గలవారు.
                    {శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి. 
                    మత్తయి-26 :41 }


ఆ గొర్రెల కాపరులు ఓ సామాన్య గొర్రెలను కాదు మేపుచున్నది,దేవాలయ సంబంధ బలులకొరకు లేవీయుల గొర్రెల మందలు.ఎందుకంటే బలులర్పించునపుడు ఆ బలిపశువు లో ఎలాంటి దోషము,కళంకము ,డాగు,మచ్చలెవీ ఉండకూడదు.

సర్వలోకము మత్తులో మునిగి నిద్రిస్తుంటే ....ఈ గొర్రెల కాపరులు ఎంతో మెలకువగా ,చురుకుగా ఎదురుచూడడము  కనపడుతుంది.
కళంకము.ఎంత జాగ్రత్తతో ప్రతీ గొర్రెను పరీక్షించే ఓపిక కావాలి,మరియు గొఱ్ఱెలలో ఏమైనా జబ్బు గాని ఏదైనా నలత డాగు గాని వెంటనే కనపడవు ,కొంచెం సమయం పడుతుంది ,అందుకోసము వారిలో ఎంత ఓపిక ఓర్పు సహనము కావాలి.వారిలో ఆ ఎదురుచూపే ఆ బలిపశువులన్నిటికి సమాప్తమైన,సంపూర్ణమైన బలిపశువును,అనగా ఈ బలిపశువులన్నిటికి నిజస్వరూపమైన యేసుప్రభువును చూచునట్లు వారిని సిద్ధపరచినది.

A Sacrificial Lamb had to be without blemish and without spot so they required extra special care ,only the best shepherds were chosen for this elite task of guarding these little lambs . Are they waiting for the sacrificial lamb to be born? In Judah Sheep are mainly for the sacrificial purpose only .

THEY WERE KEEPING WATCH OVER THE FLOCK AT MIDNIGHT. 
మనము కూడాప్రతి చీడనుండి అపవిత్రత నుండి మనలను కాపాడుకొనే సిద్ధపాటు మరియు ధైర్యము కావాలి.మనవద్దకు ఏదైనా హానికర జంతువులు వచ్చినపుడు ...అయ్యో వీటితో ఎలా ప్రవర్తించాలో తెలీదు నాకు అనుభవాలు లేదని మౌనమవుతామా !లేదు కదా!  ఓ కీడు ఎదురవగా అనుభవము అలవాటు లాంటివి మాయమవుతాయి కదా !

ఓ చక్కని గొర్రెల కాపరియైన దావీదును  గురించి ఆలోచన చేద్దాము!దావీదు ఒకసారి తన తండ్రి మందలు మేపుచుండగా ఒక సింహము  వచ్చి  దావీదు గొర్రెపిల్లను పట్టుకుని పోగా...దావీదు ఎం చేసాడు?ఆ...ఒక్క గొర్రెపిల్లే కదా ఇంకా చాలా ఉన్నాయి అని వదిలేసాడా? లేక అయ్యో సింహము బలము ముందు నా బలమెంత  అని అంచనా వేసి వెనక్కి తగ్గాడా? తనూ గెలువగలడా అనే ఆలోచన వస్తే ముందుకు వెళ్ళలేడు,అందుకే ఆ ఆలోచనలేవీ  లేవు ,కాగా దావీదు ముందుకీ దూకాడు,ఆ సింహము ఎంతటి బలము గలదైనా కావచ్చు కానీ గొర్రెపిల్ల నాది,నా గొర్రెపిల్ల కొరకు దేనికైనా సిద్ధం,కానీ  ||  నా దానిని నేనే విడిపించాలి ||  అని దావీదు సింహమును పట్టి దాని నొట్లొనుండి నుండి తన గొర్రెపిల్లను విడిపించాడు.అంటే దావీదులో గొర్రెపిల్ల నాది అనే ఆ బంధము దావీదులో తన శత్రువుకు మించిన బలమును నింపినది.గొర్రెలకాపరియైన దావీదు  ఓ సింహము ఎదుట ,సింహముఖముతో ,సింహబలంతో నిలుచుండగా...ఆ సింహము కూడా ఓడిపోయింది.అది ఓ గొర్రెల కాపరి ధైర్యము!


ఎదురుచూపులొ అంతటి ధైర్యము కావాలి.ఆ ధైర్యము మన నిరీక్షణనుండి కల్గుతుంది...మనకు దేవునికి మధ్య గల బంధము వలన  తెలుస్తుంది.ఆ సామాన్యమైం గొర్రెల కాపరులు ఎంతటి బలవంతులయ్యారంటే వారి చుట్టునున్న ధర్మస్త్రోపదేశకుల కంటే లేవీయుల కంటే యాజకుల కంటే ఎంతో గొప్ప కృప పొందారు.వారు దినదినము లేఖనములు పరిశీలిస్తూ మెస్సీయ ఎలా వస్తారు,ఎప్పుడు వస్తారు అని ఎదురుచూస్తున్నారు కానీ ఎదుర్కొనే ధైర్యం వారిలో లేదు అందుకే దేవుడు ఆ శుభవార్తను వారికి తెలుపలేకపోయారు.దేవాలయ సంబంధ విషయాలు బలుల విషయాలు ఒక్క లేవీయులు యాజకులకు తప్ప మిగిలిన వారికి అర్ధం కాదు,తెలీదు.




కానీ ఇక్కడ గొర్రెల కాపరులు సమస్త మానవజాతి కొరకు వధింపబడబోవు బలిపశువు అనగా కొన్ని యేండ్ల క్రితము ఆదాము చేయబడిన ప్రమాణ ప్రవచన పోలిక యొక్క నిజస్వరూపమైన యేసుప్రభువుల వారిని స్పష్టముగా మొదటిగా చూస్తున్నారు .మరియు పరలోక భాషను ఎంతో చక్కగా గ్రహించారు.వారు బలవంతులు.ఎదురుచూపు ఒక వ్యక్తిని బలవంతులు గా చేస్తుంది.ప్రియమైన దేవుని బిడ్డా ఆ రాత్రి పొలములో తమ మందను కాయుచు ఎదురుచూచిన గొర్రెల కాపరులు వలే,సింహము చీల్చిన దావీదు వలే  నీవు కూడా సింహ ముఖంతో సింహ బలముతో ఎదురుచూడాలి.అప్పుడే నీవు బలము పొందుతావు.
దేవుడు ఈ మాటలు మనకొరకు దీవించును గాక!ఆమెన్ ఆమెన్ ఆమెన్ !
                              

                                                          ~స్టెఫీ బ్లేస్సీనా 

            

Comments

Popular posts from this blog

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

JESUS SAW THEM STRUGGLING! By Stephy Blessena

Our LORD, walking on the Waters-నీళ్ల మీద నడచి వస్తున్న ప్రభువు-BY STEPHY BLESSEENA