JESUS SAW THEM STRUGGLING! By Stephy Blessena


                                     BERACHAH BIBLE STUDY



యేసుప్రభువు  వారి పరిశుద్ధమైన  నామములో మీకందరికీ పరిశుద్ధమైన వందనములు తెలియపరచుచున్నాము.ఈ ప్రత్యేకమైన సమయములో దేవుని లేఖనములలోనుండి మార్కు సువార్త-6:48  "అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి, వారిని దాటిపోవలెనని యుండెను." వాక్యాన్ని ధ్యానిద్దాము!

ఆయన సముద్రములో కష్టముగా ప్రయాణిస్తున్న వారిని దూరమునుండి చూచే త్వరపడి వస్తుంటే..వారాయనను గ్రహించలేదు.వారు ప్రభు  చెప్పిన మాటను బట్టియే బయల్దేరారు ,కానీ వారిని సముద్రము పరీక్షించింది.ఆ అలలు ,ఆ తుఫాను ,ఆ గాలులు వారిని బలహీనపరచినవి.అందువలన ఆ తుఫానుకు,అలలకు
ఎదురుగా దోనెను నడుపడము,వారు వెళ్ళవలసిన దిశలో దోనెను నడపటానికీ ఎంత కష్టపడుతూ ,ప్రయాసపడుతున్నారో !ఎందుకంత కష్టము?జీవితములో దేనికైనా ఎదురీదడం చాల కష్టము!పరిస్థితులకు రాజీపడిపోయి..ఆ పరిస్థితులలో కొట్టుకొనిపోవడం విశ్వాసము కాదు.విశ్వాసము ఎదురీదుతోంది.మీకు ఈ వాక్యము జ్ఞాపకముందా...ఇనుము సహితము విశ్వాసముతో నేలమీద తేలియాడుతూ ఈదుతుంది. 
2 రాజులు 6:5. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడి పోగా వాడు అయ్యో నా యేలినవాడా, అది యెరవుతెచ్చినదని మొఱ్ఱపెట్టెను గనుక6. ఆ దైవజనుడు అదెక్కడపడెనని అడిగెను; వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మయొకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను.7. అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను.

ప్రియ దేవుని బిడ్డలారా ! మనము కూడా దేవుని చేత పైకి లేపడతాము. కానీ మనముకుంటాము-నేను ఇనుమువలె బరువైనాను ఇనుము నీళ్లలో తెలియాడుతుందా...?సాధ్యము కాదు అనే నమ్ముతాము.కానీ దేవుని బిడ్డ! దేవుడు ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రములో మునిగిపోనివ్వలేదు .ఆ సముద్రాన్నిరెండు పాయలుగా చీల్చి ఆరిన నెల మీద రహదారిలో వారిని నడిపించారు.
                                                  


మన జీవితములో మనము కూడా పరిస్థితులకు  ఎదురీదాలి.చచ్చిన  చేపలు ఆ నీటి ప్రవాహములో కొట్టుకొని వెళ్లిపోతాయి,కానీ బ్రతికిన చేప మాత్రం తనూ వెళ్లాలన్న దిశలో ఎంతటి నీటి ప్రవాహానీకైనా ఎదురు వెళ్ళుతుంది.మనము బ్రతికినచేపవలెనే ఎదురీదాలి.కష్టమే కానీ మనము ప్రయత్నించాలి.ఎందుకంటే ప్రయాణము మన ఒక్కరిది కాదు.మన ప్రయాణములో ఎదురీదే పోరాటంలో ప్రభువు మనతోకూడా  ఉంటారు అనే విషయాన్ని మాత్రం మరచిపోకూడదు.ఆనాడు శిష్యులు అందుకే ప్రభువును చూచి భూతమనుకున్నారు.అయితే ప్రభువు వారు కష్టపడుతుండగా చూచారు.దేవుని బిడ్డా !నిన్ను కూడా చూస్తున్నారు,నువ్వు ఎంత కష్టపడుతున్నావో ప్రభువు చూస్తున్నారు ...విశ్వాసముంచు..ప్రభువు నిన్ను చూస్తున్నారని! ..వారాయనను భూతమనుకున్నారు అయినా ప్రభువు వారిని విడిచిపెట్టలేదు .నిన్ను కూడా విడిచిపెట్టడు.వారికొరకు, వారి భయమైన ఆ నీళ్ల మీద నడిచివచ్చినట్లు,నీ భయాల మీద ,నీ శ్రమల మీద ఆయన నడిచి వస్తున్నాడు...విశ్వాస నేత్రాలతో చూచి ప్రభువును చూచి నీళ్ల మీద నడిచిన పేతురువలే నీ శ్రమల మీద నీ భయాల మీద నీవే నడవాలి.ప్రభువు నీకు తప్పక సహాయపడతారు.దేవుడు ఈ మాటలన్నీ మనకొరకు దీవించును గాక.ఆమెన్.ఆమెన్ ఆమెన్.


                                                                                         ~✍Stephy Blesseena



Comments

Popular posts from this blog

THE MOST CRITICIZED MISSIONARY~JOHN ALLEN CHAU @Stephy Blesseena

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

ప్రేమలో క్రొత్తగా జన్మిస్తున్నాము-Stephy Blesseena