John Allen Chau/జాన్ ఆలెన్ చౌ(తెలుగులో)సెంటినెల్స్ మిషనరీ~StephyBlesseena
యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో మీకందరికి నా హృదయపూర్వకమైన వందనములు.మరియొక నూతన దినములో ఈ విధముగా దేవుని ప్రేమకై మనము ఉజ్జీవింపబడుటకు......దేవాదిదేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యముకై నేను ప్రభువునెంతో స్తుతిస్తున్నాను.ప్రియులారా...ఈ ప్రశస్తమైన సమయంలో...."దేవుని ప్రేమ భారము"ను గురించి జాన్ అలెన్ చౌ జీవితములోనుండి...మరల కొన్ని విషయాలను ధ్యానించుదాం!
దేవుని ప్రశస్తమైన ప్రేమ భారము ఒక 26 యేళ్ళ యౌవనుని,ప్రపంచంత ఈ తెగ వారిగురించినయితే భయపడి ,వణికిపోతుందో..అంతమాత్రమే గాక ,సాధరణ మనుష్య ప్రపంచానికి ఆ తెగ వారు ప్రమాదకరముగ భావించి...2006లో ఇద్దరు జాలరులు చేపలు పట్టుకోనడానికి...ఆ సెంటినలీస్ దీవికి సమీపాన...ప్రయత్నిస్తుండగా....అతి క్రూరముగా చంపబడినారు.చంపబడిన...ఆ జాలరుల మృత దేహాలు వెతకబోయిన వారు కూడా ఎంత భయానక పరిస్తితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్తితుల్లోనే....మన భారత ప్రభుత్వము...ఆ సెంటినలీస్ తెగ వారిని ఎవరు సమీపించకూడదని... నిషేధించింది.
అయితే...ఈ నిషేదము గురించి.జాన్ తన హైస్కూల్ స్టడీస్ చేస్తున్నపుడు....మిషనరీ చరిత్రలు చదువుచునపుడు....(జాషువా ప్రాజెక్ట్) The Joshua Project లో ...చదివి,చాలా భారముతో నింపబడ్డాడు.ఈ భారాన్ని అప్పట్లో ..చాలా మందితో పంచుకోగా...ఇంచుమించు ప్రతి ఒక్కరు తన ఆశను త్రోసిపుచ్చారు,చివరికి తన తల్లిదండ్రులు కూడా.వాస్తవానికి అతని మరణము తరువాత...క్రైస్తవ లోకమే....తప్పెత్తిచూపి..అది మూర్ఖత్వమని...తెల్చేసింది.జాన్ ఒక హతసాక్షి కాదు... అని ఇప్పటికి ఒక మూర్ఖుడు అని చాలా మంది...అతని క్రియల్ని తూలనాడుతున్నారు. .అయితే చాలా తక్కువ మంది మాత్రమే అతనికి సహకరించారు.వారిలో ఒకరైన
జాన్ మిడిల్టన్ రామ్సే..John Middleton Ramsey -అతని మరణము తరువాత మాట్లాడిన మాట"నిజముగా మీరు పరలోకము -నరకముని గూర్చిన సంపూర్ణ నమ్మకము మీలో ఉంటె...జాన్ చేసిన త్యాగము ఖచితముగా సరైనదేనని ఒప్పుకుంటారు".
చాలా వ్యతిరేకతలు మధ్యలో...జాన్ తన సెంటినెలీస్ పరిచర్య కోసము...ఇంచుమించు ఒక దశబ్దము సిద్దపడ్డాడు.సెంటినెలీస్ భాష తెలీదు..కానీ ఎంతో ప్రయత్నం చేసి...బైబిల్ తర్జుమా చేయడానికీ చాలా ఆశపడ్డాడు.కానీ ఆ భాష తెలియలేదు.ఆ పది సంవత్సరంలో...కొన్నిసార్లూ సెంటినెలీస్ ప్రాంతాలకు వెళ్లి...అండమాన్ దీవుల్లో కొంత మందిని కలిసి...విశేషాలు తెల్సుకుని...నేర్చుకునేవాడు.అంత మాత్రమే గాక...తన దేహాన్ని అన్ని విషయాలలో సిద్దం చేసుకుంటూ ఉన్నాడు.జాన్ ఒక సాహసవీరునిగా...ఎన్నో ప్రయాణాలు చేస్తు,తన్ను తానూ సిద్దంచేసుకుంటూ ...10 సంవత్సరాలు ఆ భారాన్ని మోస్తూనే ఉన్నాడు.
నిజముగా...దేవుని ప్రేమ ఎంత భారమైందో....కదా. ఆ భారము పరిస్తితులు చూడదు,భాష చూడదు...సుఖ దుఃఖాలు చూడదు. ఎదుటి వారి సాదరాభిమానాలు కోరదు. అవును ఇది మన ప్రభువు ప్రేమ విషయములో ఎంతో రెట్టింపుగా కనపడుతుంది. మన ప్రభువు ఆ భూమీదకు శరీరధారిగా వచ్చి,ముప్పాయిముడున్నర సంవత్సరాలు జీవించి......ఆ చివరిలో...సిలువకు అప్పగింపబడినపుడు....ఏ ఒక్కరు ఆయనను ఒప్పుకోలేదు.అంత గొప్ప త్యాగాన్ని ఎవ్వరు గుర్తించలేదు. దేవుని కోరకైన ప్రేమలో....తన తల్లితండ్రులతో ఈలాగున వ్రాసాడు,"మీరు ఈ ప్రపంచములో యేసును మాత్రమే ఎక్కువ ప్రేమిస్తారని ఆశిస్తున్నాను" అని.
October లో టూరిస్ట్ వీసా మీద పోర్ట్ బ్లెయిర్ కి వచ్చి,ఆ సెంటినెలీస్ కి సమీపాన...ఓక "సేఫ్ హౌస్"ను రెడీ చేసుకొని.....14 రోజులు క్వారంటైన్ లో ఉండీ,తనను తన్ను శుద్ధి చేసుకుంటూ,ప్రార్ధన లోను ,బైబిల్ చదువుట లోను...అనేక మంది మిషనరీల గురించి చదువుతూ..ఓక 13 పెజీల డైరీ లో తన తీర్మానమును గురించి రాసి...ప్రపంచానికి తెలియబడాలని...తన మరణానికి ఎవ్వరు బాద్యులు కాదని...ఒకవేళ ఆ సెంటినెలేస ప్రజలు తనను చంపినా గానీ వాళ్ళని బాధించవద్దని,తను వారిని క్షమిస్తున్నట్లు...వారి మీద తన.."ప్రభు ప్రేమభారము" ఎంత ఎక్కువగా తనను బలవంతము చేస్తున్నదో వివరించాడు.ప్రపంచ పరిచయము లేని ఆ ప్రజలు...తనవలన ఇన్ఫెక్షన్ అవుతారేమో అని...సూర్యకాంతి కి దూరముగా...మనుష్యులకి దూరముగా...ఉన్నాడు.అదే సమయంలో ఆ సెంటినెలీసెస్ ప్రజలకు బహుమతులు కూడా సిద్దం చేసుకున్నాడు.
2018 నవంబర్ ....15న మొదటి సారి:-
ప్రభువు ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రేమ గురించీ తెలియని ఆ అమాయకమైన ప్రజలను చెరుకోవడానికి....ప్రభుత్వము నిషేధం విధించిన గానీ రాత్రివేళ కొందరు జాలర్లకు సొమ్ము చెల్లించి...సెంటినెలీస్ ప్రజలను సమీపిస్తుండగా...కొంతమంది సెంటినెలీస్ ప్రజలు పసుపు రంగును పులిమిన ముఖాలతో గుడిసెలలో నుంచి బయటికి వస్తు...పెద్ద పెద్ద కేకలు వేస్తు అరుస్తూ...తనను సమీపిస్తూండగా...జాన్ ,"నా పేరు జాన్,నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను,యేసు ప్రభువులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.అని పెద్దగా అరుచుచు వారిని సమీపింప ప్రయత్నము చేయగా...వారు మరింత పెద్దగా అరవడముతో....వారికి తెచ్చిన బహుమానాలు, చేపలు వారికి విసిరివేసి....తిరిగి వెనక్కు వచ్చేసాడు.
November 16,
రెండవ సారి:-
సాతాను తనకు బలమైన స్థావరముగా...ఈ ప్రాంతమును పట్టుకొనకుండ ఉండలని...భారభరితుడై...మరల ప్రయత్నించి,ఈసారి మరింత ఉత్సాహముతో వెళ్ళగా....వారు కూడా..మరింత దురుసుగా ప్రవర్తించకపోయేసరికి,జాన్ ఇంకొంచెం ఉత్సాహంతో వారి మధ్యలోనికి వెళ్లి ప్రభు ప్రాణం పెట్టిన ఆ ప్రజలను ఎంతో సంతోషముతో చూచి ..ఆనందముతో నింపబడ్డాడు.వారి కేకలు...విని,వారి భాషను విని,అవే మాటలు తిరిగి వారితో పలుకగా...వారందరు అతనివైపు చూచి..నవ్వడమారభించారు.అయితే జాన్ ఇంకొంచెం చనువుతో...వారికి తన తీసుకొచ్చిన బహుమానాలు పంచి,యేసుని ప్రేమను తెలిపే కొన్ని పాటలు పాడి,తనను అక్కడికి నడిపించిన ఆ ప్రేమ గ్రంధమైన పరిశుద్ధ గ్రంధము తెరిచి,ఆదికాండము లో నుండి సువార్త మాట్లాడడము ప్రారంభించాడు,వారికి అర్ధము కావట్లేదని,మనకే కాదు తనకు కూడా తెలుసు.అయితే అది మూర్ఖత్వమో,తన పిచ్చితనమో కాదు కానీ,తన ప్రభుపై తనకున్న విశ్వాసము,"సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమనిన ప్రభుని ఆజ్ఞ....,తాననుభివించిన సిలువ ప్రేమ...ఇవి మాత్రమే....తన అణువణువునా....బలవంత పరుస్తూ వచ్చినవి.అయితే కొంచెము సమయము వారికి సువార్తను మాటలాడుచుండగా....వారిలో ఒక చిన్నవాడు జాన్ ను గురిపెట్టి ఒక బాణము వేయగా..అది జాన్ బైబిల్కి తగలగా..ఆ బాణాన్ని తీసి ఆ చిన్నవాని చేతిలో పెట్టాడు.అయితే వెంటనే..మిగిలివారందరు కూడా బాణాలు ఎక్కుపెట్టి...పెద్దగా అరవడముతో,జాన్ అక్కడ త్వర త్వరగా వెనక్కి తిరిగి తన సేఫ్ హౌస్ కి వచేసాడు.తన డైరీలో ఇదే "తను చూచే ఆఖరి దినము కావచ్చును"..అని రాసుకున్నాడు.మరల రేపు ..అనగా మూడవ దినము తానూ వెళ్ళునపుడు ..ఇంకా తిరిగి మరల రాదు అని అతనికి అర్థమైపోయింది.
November 17న,
చివరి ప్రయత్నము...ఎంతో భారమైన మనస్సుతోను ,సెంటినెల్స్ ప్రజలను మరల చూడబోతున్నాడనే..సంతోషముతోను .....ముందుకు ప్రయాణించాడు.అయితే..ఈసారి తనతో నుండిన జాలర్లను ....రావద్దని,తాను ఒక్కడే బయల్దేరాడు.కానీ తిరిగి రాలేదు.
ఎంతకి రాలేదని ఆ జాలర్ల జాన్ ను వెతుకుతూ చూడబోగా...సెంటినెల్స్ వారు జాన్ మృత దేహాన్ని బల్లెముతో సముద్రపు ఒడ్డునకు ఈడ్చుతూ కనబడగా...ఆ జాలర్ల అక్కడి నుండి తప్పించుకుని వెళ్లిపోయారు.ఈ సంగతి తెలిసిన ప్రభుత్వమ..ఆ జాలర్లను అరెస్ట్ చేయగా... జాన్ తల్లిదండ్రులు...బ్రతికున్నపుడు తమ కుమారుడు వ్రాసిన తన మరణమును గురించిన డైరీ పోలీసుల చేతికందించగా...వారిని విడుదల చేసారు.
ప్రియా దేవుని బిడ్డా...ప్రభు ప్రేమ భారము నీలో ఎంతగా మండుతుంది?జాన్ పొందిన ఆ భారము ...నీలో ఎప్పుడు నింపబడుతుంది?సంవత్సరాలు గడుచుచుండగా..అన్నింటి అంతము వచేయుండగా...నీవెంత త్వరపడుతున్నావ్?"సర్వలోకానికి వెళ్లి,సర్వసృష్టకి సువార్తను ప్రకటించుడి...అనే ఆజ్ఞ..నీ హృదయాన్నిఇంకా...తాకలేదా?ఈ ఆజ్ఞ అందరిని నిన్ను,నన్ను....ప్రభు ప్రేమ అనుభవిస్తున్న ప్రతి వ్యక్తికీ చెందుతుంది.పరిశుద్దాత్మ దేవుడు నీలో ఆ భారము నింపాలని.... వెడుతున్నాను.దేవుడు ఈ మాటలన్నీ మన కొరకు దీవించును గాక.ఆమెన్.ఆమెన్ ఆమెన్
............ స్టెఫీ బ్లేస్సీనా
Comments
Post a Comment