ఆదినుండి ఉన్నవాని ప్రత్యక్షత ~Stephy Blesseena
GREETINGS TO YOU ALL IN THE MARVELOUS NAME OF OUR LORD AND SAVIOR JESUS CHRIST.
ప్రియులారా...మీకందరికినియేసుప్రభువారి పరిశుద్ద నామములో వందనములు.మీరందరు బావున్నారా?నిన్నటి వాక్యభాగము ద్వార మీరు దేవుని ఆత్మ బలపరచబడినారా?ఈ వాక్యసందేశముల ద్వార మీరు ఎలాగు మేలు పొందుతున్నారో తెలియపరచగలరని...ఆశిస్తున్నాను.ఈ దినపు దేవుని వాక్యము కోరకై దేవుడు నాకు దయచేసిన మాట "ఆది నున్న వానినియెరుగుట"
🔴1 యోహాను-1:1. జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.
.ఇక్కడ యోహాను ...తాను వినినది,తాను కన్నులార చూచినది,తాను నిదానించి కనుగొనినది తాను తాకి చూచినది....ఎవరిని ??? వారితో మూడున్నర సంవత్సరాలు సహవాసము చేసిన ప్రభువునా? ఇక్కడ యోహాను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు?
మూడున్నర సంవత్సరాలు సహవాసము చేసినది ఆ ప్రభువుతోనే కదా! మరి ఆయనను తాకడము,ఆయన మాట వినడం,ఆయనను చూడడము లో అంత ప్రత్యేకత ఏంటి?మరియు కళ్ళముందరే కనపడుతున్న ప్రభువును నిదానించి కనుగొనుట ఏంటి?
యోహాను నిదానించి కనుగొనినది తాను మూడున్నర సంవత్సరములు సహవాసము చేసిన శరీరధారియైన ప్రభువును కాదు శరీరము దాల్చుటకు ముందున్న వానిని గూర్చి నిదానించి కనుగొనినాడు!శరీరము దాల్చిన ప్రభువును...యోహాను 1:1 లో దేవుని యొద్ద నుండిన వానిగా..ఆదిలోనుండి ఉన్నవానిగా యెరిగినవాడు యోహాను.శరీరము దాల్చకమునుపు దేవుని యొద్ద ఉన్నా వాక్యము అనగా....దేవుని దగ్గర ఆదినుండి, జగతికి పునాది వేయబడకముందు నుండి ఉన్నవానిని ఏరిగెను.అంటే చూచుట,కనుగొనుట,తాకుట ను మించిన అనుభవం!ఈ అనుభవము ఆయనతో సహవాసము చేయుటనుబట్టియే !యోహానువలె మనకును ఈలాటి సహవాసము కావాలి.ఈ సహవాసములో దేవుని originality ni ,దేవుని స్వభావాన్ని చాలా సమీపముగా ఎరిగినాడు.భూసంబంధమైన దృష్టితో కాదు, ఆత్మసంబంధ దృష్టితో చూస్తున్నాడు.అందువలననే క్రీస్తు విరోధియొక్క పోలికను...స్పష్టముగా చూడగలిగెను.(1 యోహాను-2:19),అని చెప్పగలుగుచున్నాడు.నిజముగా మనము క్రీస్తునకు విరోధిమైన క్రియలను గ్రహించగల్గుచున్నమా?లేనియెడల మనము ఆదినుండి యున్న వానిని యెరుగనివారమే.దేవుడు ఈ మాటలను మన కోరకు దీవించును గాక..ఆమెన్. ఆమెన్. ఆమెన్.
✍️స్టెఫీబ్లెస్సీనా
Comments
Post a Comment