దేవునితో నడచుట అంటే-విశ్వాసము అంటే @StephyBlesseena



‭ఆదికాండము 39:2 ~ యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను.
యేసుప్రభువారి పరిశుద్ద నామములో మీకు పరిశుద్దమైన వందనములు.నిజముగా దేవుని వాక్యము మనకి ఎంత సమీపముగా ఉన్నది!అదీ ఎంత ఆశ్చర్యం కదా!మంచిది...ఈ ప్రశస్తమైన సమయములో మన మూల వాక్యము మరియు మన సమీపమునకు మన యొద్దకు పంపబడిన దేవుని వాక్కు.దేవుడైన యెహోవా యోసేపు తోడుగా ఉండెను.దేవుడు యోసేపు తోడుంటుట!ok.
దేవుడు యోసేపుకు ఎలా తోడున్నారు?ఆత్మలో ఆత్మగా లేక ప్రాణములో ప్రాణముగా,లేక దేహములో దేహముగా?లేక ఒక వాక్యముగా తోడున్నారా?ఒక వ్యక్తికి దేవుడు తోడుండుట అంటేనే ఆశ్చర్యము!ఆ మాట ఒక్కసారి చెప్పినపుడే ఖచ్చితంగా అర్ధమైపోతుంది.కానీ దేవుడు ఒక్కసారి కాదు 3 సార్లు కన్నా ఎక్కువ గా యోసేపు తోడున్నట్లు వ్రాసారు.దేవుడు యోసేపుకు తోడున్నారు ok,కానీ ఎందుకు అన్నీసార్లూ మనకి చెప్పాలనుకుంటున్నారు?

దేవుడు ఒక మనిషికి ఎలా తోడుంటారు అనేది మాటల్లో సరిపెట్టగలిగేది కాదు.దేవుని తోడును ఒక్కో వ్యక్తి ఒక్క విధముగా అనుభవిస్తాడు.అయితే ఆ మనిషి గ్రహించే విధానంలో ఉంటుంది !

అసలు దేవుడు ఎలా తోడున్నారు అనేమాటకంటే ముందు ఎందుకు తోడున్నారు అనే మాట మనం ధ్యానిస్తే అర్ధమౌతుంది.అవును అసలు దేవుడెందుకు యోసేపు తోడున్నారు?యాకోబు లాగనే దేవునికి కూడా యోసేపు అంటే అంత ఇష్టమా?అవును!ఇష్టమైన వ్యక్తినే కదా సంతోషముగా ఉండగలం!సరే యాకోబుకు ఎందుకు ఇష్టం?కడసారివాడనా?తన ప్రియమైన భార్యా కుమారుడనా?కాదే ,ఇంకో చిన్న కుమారున్నాడుగదా ఆ ప్రియమైన భార్య కుమారుడే!సరే ఎందుకిష్టమంటే తన 10 మంది కుమాళ్లలో తన మనసు పంచుకుని చెడుతనమును అసహ్యించుకున్నవారు లేరు.కాని యోసేపు చిన్ననాటనుండే చెడుతనాన్ని అసహ్యించుకుని తండ్రి దగ్గర తన అన్నదమ్ముల గురించి పంచుకుని బాధపడేవాడు.‭ఆదికాండము 37:2......... అప్పుడు యోసేపు వారి చెడుతనమునుగూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు.
                            మఱియు యోసెపుకు గురించి వ్రాయబడినపుడు "యెహోవా వాక్కు యోసేపును పరిశోధించుచుండెను"అని లేఖనములో చూస్తాము.

అంటే యోసేపు తన జీవితములో అడుగుడుగునా పరిశీలింపబడి,పరిశోధింపబడ్డాడు.పరిశోధిస్తు,పరిశీలిస్తు దేవుడు యోసెపుకు తోడైయున్నారంటే....యోసేపులో తనకి అసహ్యమైనవి,ఒకటీ కుడా లేదా?అవును కనబడలేదు  యోసేపు ప్రతి నడతను ప్రవర్తనను దేవుని వాక్కు పరిశోధిస్తూ....ఉండెను.

ఆదికాండము 5 :24. లో  హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.  హానోకు దేవునితో నడిచినవాడు,ఆదికాండము 6 : 9నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.అయితే హెబ్రీ పత్రిక లో హానోకును గురించి గాని,నోవహును గురించి గాని వారు దేవునితో నడిచారు అనే మాట కనపడదు,కానీ హెబ్రీ 11 :5. విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొని పోయెను గనుక అతడు కనబడలేదు.6. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.7. విశ్వాస మునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాస మునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.


దేవునితో నడచుట అంటే దేవునికి ఇష్టులై యుండుట.ఇష్టముగా నుండుట అంటే విశ్వాసముంచుట!మన ప్రతి ప్రవర్తనలో నడత లో దేవుని సంతోషపరచుట .....అదే విశ్వాసము.ఎప్పుడైతే మనము దేవుని సంతోషపరచుటకు ఆశపడి,ఇష్టపడతామో ......అప్పుడు మనము కూడా హేబెలు వలే  ఆయనకు ఇష్టమైనవి,సంతోషపెట్టేవి ఎంచుకుంటాము.హేబెలు దేవునికి అర్పణ ఇచ్చునప్పుడు he was so considerate and was very patient,he choose very patiently the first ones of his flock and in that flock of first ones he selected the most fatty ones.తొలిచూలున పుట్టిన వాటిని ఎంత జాగ్రత్తగా గుర్తించి కాపాడాలి ,వాటిలో క్రొవ్విన వాటిని దేవునికొరకు ప్రత్యేకపరచుట.అలాంటి మనస్సే విశ్వాసము ....విశ్వాసము అంటే దేవుని తో ఏకీభవించుటకు మనం ఇష్టపడటం.తొలిచూలున పుట్టిన వాటిని ఎంత జాగ్రత్తగా గుర్తించి కాపాడాలి ,వాటిలో క్రొవ్విన వాటిని దేవునికొరకు ప్రత్యేకపరచుట!.అలాంటి మనస్సే విశ్వాసము ....విశ్వాసము అంటే దేవుని తో ఏకీభవించుటకు మనం ఇష్టపడటం.హానోకు అయినా నోవహు అయినా యోసేపు అయినా ....వారు దేవుని సంతోషపెట్టారు తమ ప్రతి నడతలో ,ప్రవర్తనలో.
ఈ మాటలు చదువుచున్న మీరు కూడా హానోకు వలే నోవహు వాలే యోసేపు వలే దేవుని సంతోషపెట్టుట ఎంచుకొనాలి...అప్పుడు మనము కూడా మన విశ్వాసములో  దేవుని ప్రసన్నతను కనుగొనగలం. అవును యోసేపుకు తోడైయుండిన దేవుడు మనతో కూడా ఉంటారు,ఉన్నారు.దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక.!ఆమెన్ ఆమెన్ ఆమెన్ 


                                                                                            ✍StephyBlesseena.


                                         MAY GOD BLESS YOU ,AMEN AMEN AMEN
                                    LETS MEET AGAIN WITH A NEW WORD AGAIN.

Comments

Popular posts from this blog

THE MOST CRITICIZED MISSIONARY~JOHN ALLEN CHAU @Stephy Blesseena

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

ప్రేమలో క్రొత్తగా జన్మిస్తున్నాము-Stephy Blesseena