Posts

JESUS SAW THEM STRUGGLING! By Stephy Blessena

Image
                                      BERACHAH BIBLE STUDY యేసుప్రభువు  వారి పరిశుద్ధమైన  నామములో మీకందరికీ పరిశుద్ధమైన వందనములు తెలియపరచుచున్నాము.ఈ ప్రత్యేకమైన సమయములో దేవుని లేఖనములలోనుండి మార్కు సువార్త-6: 48  "అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి, వారిని దాటిపోవలెనని యుండెను. "  వాక్యాన్ని ధ్యానిద్దాము! ఆయన సముద్రములో కష్టముగా ప్రయాణిస్తున్న వారిని దూరమునుండి చూచే త్వరపడి వస్తుంటే..వారాయనను గ్రహించలేదు.వారు ప్రభు  చెప్పిన మాటను బట్టియే బయల్దేరారు ,కానీ వారిని సముద్రము పరీక్షించింది.ఆ అలలు ,ఆ తుఫాను ,ఆ గాలులు వారిని బలహీనపరచినవి.అందువలన ఆ తుఫానుకు,అలలకు ఎదురుగా దోనెను నడుపడము,వారు వెళ్ళవలసిన దిశలో దోనెను నడపటానికీ ఎంత కష్టపడుతూ ,ప్రయాసపడుతున్నారో !ఎందుకంత కష్టము?జీవితములో దేనికైనా ఎదురీదడం చాల కష్టము!పరిస్థితులకు రాజీపడిపోయి..ఆ పరిస్థితులలో కొట...

WATCHING & WAITING ~StephyBlesseena

Image
                                        WATCHING OVER THE FLOCK                 WAITING OVER THE NIGHT                                             ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు                         పొలములో ఉండి రాత్రివేళ తమ  మందను కాచుకొనుచుండగా.....                                    ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను;              ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి.                                         లూకా సు...

RUTH: A CROWN FOR THE LORD'S PURPOSE ~ Stephy Blesseena

Image
Greetings to you All in the most precious and  mighty name of our LORD and SAVIOUR JESUS CHRIST "రూతు-దేవుని చిత్తానికి ,దేవుని ఆలోచనలకు కిరీటమును,మహిమయై యున్నది" రూతు-3:11   కాబట్టి నా కుమారీ, భయపడకుము;  నీవు చెప్పినదంతయు నీకు చేసెదను.  నీవు యోగ్యురాలవని నా జనులందరు ఎరుగుదురు. దేని విషయములో ఆమె యోగ్యురాలిగా  ఎంచబడినది?ఎందుకు యోగ్యత?అసలు ఒక వ్యక్తికి యోగ్యత అవసరమా?అసలు మన వ్యక్తిగత జీవితాల్లో యోగ్యత ఎందుకు?ఎం చేస్తుంది?ఇక్కడ బోయజు రూతును గూర్చి ,ఆమె తనకు భార్యగా యోగ్యురాలు అంటున్నాడా?లేక మరింకేదైనా విషయములోనా? యోగ్యతగా అంటే ఏమిటి? బోయజు దృష్టిలో ఏది యోగ్యత? మీ దృష్టిలో యోగ్యత అని దేనిని అనుకుంటున్నారు? తగ్గించుకోవడం ....ఇమిడిపోవడం,ఒదిగిపోవడం ..కదా ! ఇలాంటి అర్ధాలు ఉన్నాయి యోగ్యతకు. మరి రూతు దేని విషయములో యోగ్యురాలిగా ఎంచబడినది? రూతు ఎటువంటి కుటుంబము లోనుండి వచ్చింది?ఆ కుటుంబ మర్యాదలు ఎలాంటివి?అని  మనము ఆలోచిస్తే అసలు ఏ మాత్రమూ పొందిక కుదరదు! 👉🕮 ఆదికాండము 19: 37 " వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను  పే రు పెట్టెను. అతడు నేటివరకు మోయా...

Our LORD, walking on the Waters-నీళ్ల మీద నడచి వస్తున్న ప్రభువు-BY STEPHY BLESSEENA

Image
యేసుప్రభువు వారి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో దేవుని ప్రియులైన మీకందరికీ నా హృదయ పూర్వకమైన వందనములు. దేవుని బిడ్డలారా ఈ ప్రత్యేక మైన సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగములను ధ్యానము చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప కృపను  బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను.ఈదినము మన వాక్య ధ్యానము కొరకై --  * మత్తయి 14:25‭-‬33 "రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు–ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి – ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను. వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలో నున్నవారు వచ్చి–నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.     ...

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

Image
యేసుప్రభువారి పరిశుద్ధ నామములో దేవుని ప్రియులైన వారందరికీ మా హృదయ పూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాము. దేవుడు ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోనికి తీసుకు వెళ్ళడానికి గల కారణములలో మొదటిది ....ఆ  అమలేకీీయల పాపము సంపూర్ణము కానందు వలన ,ఇశ్రాయేలీయులను ఒక పరిశుద్ధమైన జనాంగముగా చేయాలనీ...రెండవ కారణము వారికి క్రమ శిక్షణ నేర్పడానికి! ఆ వాగ్దన దేశము పవిత్రమైనదే కానీ అందులో  నివసిస్తున్న ప్రజలు అపవిత్రమైన క్రియలు చేయుటవలన ఆ దేశము అపవిత్రతతో నిండిపోయింది.ఆ అపవిత్రత  ఇశ్రాయేలీయులలోనికి ప్రవేశించకూడదు.అందుకని దేవుడు...ఆ అపవిత్రత లోనుండి వేరు చేయడానికే....సమస్త భూమ్మీద ఓ గొప్ప కరువు రప్పించి దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చాడు. అప్పటికే యాకోబు కుమారులలో రూబేను,యూదా,షిమ్యోను,లేవి,దీన,.....ఆ దేశపు అపవిత్రత కొంచెం కొంచెం గా...ప్రవేశిస్తుంది .రూబేను తన తండ్రి ఉపపత్నియైన బిల్హా  విషయములో,దీనా ఆ దేశ సంచారము చేసి చూడటములోను,షిమ్యోను లేవీయులు ఆ షెకెము కు చేసిన నాశనము విషయములో ,యూదా కుమారుల విషయములో,యోసేపు మీద పగబట్టి అమ్మివేయు విషయములో ..ఇలాంటి కార్యాలు చాల ఉ...

నా స్వచిత్తము

Image
జ్ఞానులు క్రీస్తును రాజు అని ధృవీకరించేందుకు బంగారాన్ని అర్పించారు. వాళ్లు బంగారం తెచ్చి నిన్ను ధనవంతుడ్ని చేస్తున్నాం అనలేదు. బంగారం, ... అవేవైనా సృజించబడినవి, అన్నింటిపైన ఆయన సర్వశక్తి గలరాజుఅని నువ్వు ధృవీకరించాలి. అందుకోసం మనం బంగారాన్ని ఆయనకు అర్పించాలి. ఎప్పుడు మనం ఆయనను మన సొంత ప్రభువుగా రాజుగా కలిగి ఉండగలమో అప్పుడే అది సాధ్యమౌతుంది. నా స్వంత చిత్తం ఆర్పివేయబడినపుడు అది నాలో పరిపాలన చేయదు. నాలో క్రీస్తే కేవలం క్రీస్తే పరిపాలకుడు, నాలో ఏది ఆయనను సంతోషపెడుతుందో దానిని ఆయన నాలో జరిగిస్తాడు. యోహాను సువార్త 20వ అధ్యా యంలో మగ్దలేని మరియతో తన మరణ పునరుత్థానాల తరువాత “నా తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని సహోదరుల వద్దకు వెళ్లి చెప్పుమన్నారు”. మరియతో “నీవు వెళ్లి నా వద్ద నుండి పారిపోయిన సహోదరులకు వెల్లడి చెయ్యమని” చెప్పటంలో శిక్ష, నిత్య నాశనం పొందవలసిన వారికి, నా ఈ పునరుత్థానం వాళ్లు మంచి కోసమేనని, ఈ పునరుత్థానం వలన నా తండ్రి, వారి తండ్రి అవుతాడని, నా దేవుడే వారి దేవుడౌతాడని చెప్పాడు. హెబ్రీ పత్రిక రాసిన రచయ...

TheBible

Image
బైబిలు చదువు, ఒక దినపత్రికలాగా కాదు, మన ఇంటికి వచ్చిన ఉత్తరం లాగా చదువు. పక్వానికి వచ్చిన పరలోక ఫలాలు వ్రేలాడుతూ మనకు అందేంత సమీపంలోనే అవి ఉన్నాయి, వాటిని ప్రోగుచేసుకో. ఆ పేజీలో వాగ్దానం దొరికిందా నీకు ఇష్టమైనంత సొమ్ము నీవే వ్రాసుకుని బ్యాంకు నుండి సొమ్ము తెచ్చుకునేందుకు నీ చేతిలో ఉన్న ఖాళీ చెక్కు అది, సొమ్ము చేసుకో. ప్రార్థన అక్కడ కనిపించిందా, దానిని పొదివి పుచ్చుకో. అది నీ అంబుల పొదిలో మరో బాణం నీ ఆశను నెరవేర్చేది. పరిశుద్ధతకు ఒక ఉదాహరణ నీముందు కనిపించిందా? దేవుడ్ని అడుగు నీకు ఆయన ఎంత చేయగలడో అంతా చేయమని. ఒకవేళ మహిమాయుతంగా సత్యం బయలు పర్చబడితే నక్షత్రంలాగా నీ జీవితాన్ని ప్రకాశింపజేసేట్లు దానిని నీలో ప్రవేశిం పనివ్వు. నీలోని పరిశుద్ధమైన కోరికలు లతల్లా లేఖనాలను పెనవేసుకోని.అప్పుడు నీవు కూడా కీర్తనాకారునిలా నీ శాసనాన్ని నేను ప్రేమిస్తున్నాను, దినమంతా దానిని ధ్యానిస్తాను” అని చెప్పగలవు. దానిని సాధన చేసేందుకు సిద్ధపడితే తప్ప, లేఖన జ్ఞానాన్ని తలకెక్కించుకుని దాని విషయమై కలలు కంటే ప్రయోజనం లేదు. మనముందుంచబడిన అభిప్రాయాన్ని బాధ్యతగా నిర్వహిస్తే తప్ప ప్రయోజనం లేదు. మన ఆహ్లాదం కోసం...