Posts

Well-Disciplined Life Of a Vision

Image
Having a goal and a vision is a Blessing.A Life without a goal is a life without a reason.Life without a vision is useless and waste both in spirit and in body/flesh. Youtube message ఒక గురి కలిగిన జీవితము అనేది క్రమశిక్షణలో నడుచుకుంటున్న జీవితము.క్రమశిక్షణ అనగా దేవుని వలన బోధింపబడేది,దేవుని వలన బోధించబడే వ్యక్తి ఒక నియమనిబంధనతో కూడిన గురి కలిగియుంటాడు అలాంటి జీవితము అనగా గురి లేని  జీవితము దారము తెగిన గాలిపటం వంటిది ఆది ఎంతటి విలాసవంతమైన జీవితమైనా,అనుకున్నవి అన్నీ-కోరినవి అన్నీ అనుభవించిన జీవితమైనా,ఆది శూన్యమే మరింత స్పష్టముగా వ్యర్ధమే. ప్రతీ జీవితానికి ఒక లక్ష్యము,గురి,దర్శనం ఒక్కటి ఉంటుంది.ఆ గురిని తప్పటమే మరణము అని పాత నిబంధన స్పష్టపరస్తుంది.మరణము అంటే గురి తప్పిపోవుట.పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించుట అని క్రొత్తనిబంధనలో యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను సూటిగా చెప్తున్నారు .ప్రతి జీవితానికి ఒక గురి ఉంది.అయితే నీ జీవితములో దేవుని గురి ఏంటో,ఆయన అభిలాష ఏదో? అది తెలుసుకొని దానిని చేరడమే దేవుని చిత్తము,దేవుని నమ్మి జీవితాన్ని అ...

దేవుని పక్షము vs అపవాది పక్షము

Image
1 సమూయేలు - 18:17 "నీవు నా పట్ల యుద్ధ శాలివైయుండి యెహోవా యుద్ధములను జరిగించుము." ఈ భాగము దావీదుజీవితంలో ఎదురైన ఓ గొప్పసవాలు.   ఇశ్రాయేలియుల చరిత్రను ముగ్గురు వ్యక్తులు శాసించారు. 1. అబ్రహము - ఒకసంతానం వంశాన్ని స్థాపించినాడు,  2. మోషే- అబ్రహము పొందిన ఆ వాగ్దానాలు నెరవేర్చుటకు ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవటానికి,దేవునికి - ఇశ్రాయేలీయులకు మధ్య ఒక మధ్యవర్తిలా- ధరశాస్త్రాన్ని  వారికందించి - వారినే - దేవునికి స్వాస్థం చేశాడు. 3 . దావీదు - దేవునికి ఒక సింహాసనాన్ని సిద్దపరచి,స్థిరపరిచాడు. ఆ వాగ్ధాన దేశాన్ని రాజ్యపరంగా, భూజనులనులందరిలో ఇశ్రాయేలు ఘనత నొందునట్లు, ఆ రాజ్యాన్ని స్థిరపరిచాడు. అయితే తాను బాల్య కాలములో, ఇంచుమించు 15-17 సంవత్సరాల వయస్సులో అభిషేకం పొందిన తరువాత, ఒక పెద్ద యుద్ధం ఎదురైంది, *గొల్యాతు అనే శూరుడు ఎదురవగా- ఆ యుద్ధంలో ఇది యెహోవా యుద్ధము అని అయిదు చిన్న రాళ్లతో ఆ బలాడ్యుడైన యుద్ధనేర్పరిని నేలను కూల్చగలిగినాడు. 17 వ అధ్యాయములో కనబడుతున్న యుద్ధం బాహ్యముగా కనిపించుచున్నగాని దావీదుకు మాత్రము అంతరంగిక యుద్ధం. అది బయటికి-బాహ్యంగా గొల్యాతు అంత శూరము...

Elshaddai'sProtection in telugu

Image
కీర్తనలు 91:1-13 MSG ఉన్నతమైన దేవుని సన్నిధిలో కూర్చున్న మీరు, ఎల్షద్దాయి నీడలో సమయం గడపండి, ఇలా చెప్పండి: “దేవా, నీవే నాకు ఆశ్రయం. నేను నిన్ను విశ్వసిస్తున్నాను మరియు నేను సురక్షితంగా ఉన్నాను! ” అది నిజం అయన రహస్యమైన ఉచ్చులు నుండి మిమ్మల్ని రక్షిస్తాడు, ఘోరమైన ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడతాడు. ఆయన బలిష్టమైన హస్తాాలు మిమ్మల్ని రక్షిస్తాయి- వాటి కింద మీరు సంపూర్ణంగా సురక్షితంగా ఉన్నారు;  అన్ని రకాలైనా కీడుల నుండీ తప్పించుకుంటారు. దేనికీ భయపడవద్దు-రాత్రిపూట అడవి తోడేళ్ళకు కాదు, పగటిపూట బాణాలు ఎగరడానికి కాదు, చీకటిలో వ్యాపించే వ్యాధి కాదు, మధ్యాహ్న సమయంలో చెలరేగే విపత్తు కాదు. ఇతరులు చుట్టుపక్కల లొంగిపోయినప్పటికీ, ఈగలలాగా కుడి మరియు ఎడమకు పడిపోయినప్పటికీ, ఏ హాని కూడా మిమ్మల్ని ముట్టుకోనకుండా, తాకబడకుండా నిలబడతారు, దూరం నుండి అన్నింటినీ చూడండి, దుష్టులు శవాలుగా మారడాన్ని చూడండి. అవును, దేవుడు మీ ఆశ్రయం, మహోన్నతమైన దేవుడు మీ స్వంత ఇల్లుు. కాబట్టి, చెడు మీకు దగ్గరగా ఉండదు,నిన్ను కాపలాగా ఉంచమని తన దేవదూతలను ఆదేశించాడు. మీరు పొరపాట్లు చేస్తే, వారు మిమ్మల్ని పట్టుకుంటారు...

Rahab-Faithfulness raahaabu విశ్వాసము

Image
తన యెడల నమ్మకత్వం గలిగిన వారిని దేవుడు ఎన్నడు విడిచిపెట్టడు. యెహోషువా - 6:22 - 25 రాహబు- ఒక వేశ్యయే కావచ్చు గానీ,దేవుని యెడల ఎంత నమ్మకత్వం కనుపరచింది!యెరికో గోడల - ప్రాకారముల మీద నివసించే ఆమే,ఇప్పుడైతే(6:25) - ఇశ్రాయేలీయులతో కలిసి నివసించుచున్నది. హీనమైన- అమర్యాద గల్గిన ఆమె జీవితం ఎంతలా మార్చబడింది! - *నిజంగా దేవుడు మనలను మార్చగలడు , మనలను మార్చలేనివాడు కాడు, మార్చగలడు కాబట్టి మనలను స్వీకరించాడు. *ఎంతటి వారినైనా, ఆయనకు సమానమైన రూపము- స్వభావంలోనికి మార్చగలడు . -అయన రక్తానికీ ఎంత శక్తి వుంటే...అంత సమాన రూపానికి మార్చగల్గుతుంది?. రాహాబు జీవితం ఎంత అద్భుతంగా మార్చబడిందో ! ఆమే దేవుని వంశంలో - చేర్చబడింది. * అది కూడా - దేవుని వంశంలో...యూదా గోత్రములో. దేవుడు ఆమెను,ఇశ్రాయేలు 11 గోత్రములలో చేర్చలేదు గాని యూదా గోత్రములో చెర్చారు దేవుని గోత్రమైన - యూదా గోత్రములోనే దేవుడు select చేసి చేర్చాడు. దేవుని నమ్మటం అంటే, చెడుతనాన్ని విడిచిపెట్టడం. ఆమె నమ్మింది, చెడుతనం విడిచిపెట్టింది, భయపడింది. రక్షింపబడింది, తన ప్రవర్తన (వ్యభిచారం) మానుకునింది. ఆమె ధర్మశాస్త్రానికి లోబడింది. ఇశ...

సర్వ చిత్తంబు నీదేనయ్యా

సర్వ చిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే (2) సారెపైనున్న మంటినయ్యా సరియైన పాత్రన్ చేయుమయ్యా సర్వేశ్వరా నే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును ||సర్వ చిత్తంబు|| ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే ప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2) పరికింపు నన్నీ దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధున్ జేసి పాలింపుమా పాపంబు పోవ నను కడుగుమా ||సర్వ చిత్తంబు|| నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2) నీఛమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ నిజమైన సర్వ శక్తుండవే నీ చేత పట్టి  రక్షింపుమా ||సర్వ చిత్తంబు|| ఆత్మ స్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహ పరమున (2) అధికంబుగా నన్ నీ ఆత్మతో ఆవరింపుమో నా రక్షకా అందరు నాలో క్రీస్తుని జూడ ఆత్మతో నన్ను నింపుము దేవా ||సర్వ చిత్తంబు||

నే నీవాడనై యుండఁ గోరెదన్-Iam Thine,O LORD

            1. నే నీవాడనై యుండఁ గోరెదన్ నే నీవాడనై యుండఁ గోరెదన్ యేసుప్రియ రక్షకా నీవు చూపు ప్రేమను గాంచితిన్ నన్నుఁ జేర్చు నీ దరిన్ ||నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా నీవు పడ్డ సిల్వకున్ నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా గాయపడ్డ ప్రక్కకున్ || 2. నన్నుఁ బ్రతిష్ఠ పర్చుమీ నాధా నీదు కృపవల్లనే నాదు నాత్మ నిన్ను నిరీక్షించు నీ చిత్తంబు నాదగున్ 3. నీదు సన్నిధిలో నిఁక నుండ నెంత తుష్టి నాకగున్ స్నేహితునిగా మాటలాడెదన్ సర్వశక్త ప్రభుతో 4. నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదు పరమందున దాని శ్రేష్ఠత నే ననుభవించెదన్   I am Thine, O Lord, I have heard Thy voice, I am Thine, O Lord, I have heard Thy voice,   And it told Thy love to me; But I long to rise in the arms of faith,   And be closer drawn to Thee.   Draw me nearer, nearer, nearer blessed Lord,   To the cross where Thou hast died; Draw me nearer, nearer, nearer, blessed Lord,     To Thy precious, bleeding side. 2 Consecrate me now to Thy service, Lord,   By the pow’r...

మానవుని దృష్టిలో,దేవుని దృష్టిలో భక్తి అంటే.....?

Image
భక్తి అనేది..ఈరోజుల్లో ఒక సామాన్యమైన,సులువైన కార్యమైపోయింది.చాలా సులభముగా ఎవరైనా చేయగలిగితే చౌక-cheapగా భావ్యమౌతుంది.ఒక పాట,ఒక మాట అర్ధమైతే చాలు ఇంకా అదే భక్తి అనుకోని మురిసిపోతున్నాము.కానీ భక్తి అంటే-దేవునితో నడవడం అంత సులభమా?భక్తి అంటే-దేవుని యెదుట నడువడం,భక్తి -దేవుని కోసము నడవడం,దేవుని పక్షముగా నడువడం అంత సులభమా? దేవుని కోరకు ప్రత్యేకించబడినవారే,దేవుని కోరకు వేరుపరచుకున్నవారే ,దేవుని కోరకైన సమర్పణ కలిగినవారే దేవుని కోరకు నడువగలిగె సామర్ధ్యము,బలము,శక్తి,ధైర్యము పొందుదురు. దేవుని భక్తులను గూర్చి పరిశుద్ధ లేఖనములో కీర్తనకారుడైన దావీదు ఈలాగు చెప్పుచున్నాడు, దేవుని చేత బోధించబడే అభ్యాసము కలిగినవారుగా ఉండాలనీ తన కోసము దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు. *ఆయనయందు ఉపదేశించబడుట ....ఎఫెసీ-4:20,21 *ఆయన తన మార్గములను మనకు బోధించును .యెషయా-2:3 *ఆయన మనలను నడిపించాలి,మనకు నేర్పించాలి..అప్పుడే ఆది భక్తి అవుతుంది.ఆయన నిన్ను నడిపిస్తే సకల జ్ఞానము గూర్చి,సకల విద్యలు గూర్చి నేర్పుతారు.భక్తి ఎలాంటిదో,అది ఎలా చేయాలి నేర్పిస్తారు. నీ ప్రవర్తనా ఎలా ఉండాలో,నీ...