ప్రేమలో క్రొత్తగా జన్మిస్తున్నాము-Stephy Blesseena
.jpg)
యేసుప్రభువారి పరిశుద్ధ నామములో మీకందరికీ పరిశుద్ధమైన వందనాలు తెలియపరుస్తున్నాము.దేవుని ప్రియులారా మీరందరు ఎలా ఉన్నారు?బావున్నారా?అవును !మనమందరము దేవుని ఆశ్చర్యమైన కృపలో ఎంత శ్రద్దగా కాపాడబడుతున్నామో! *విలాపవాక్యములు 3: 23. -అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు. అనుదినము నూతన పరచబడుచున్న ఆయన ప్రేమలో క్రొత్తగా జన్మిస్తున్నాము.లోకములో ఏ గొప్పవారికి లేని కృప ఇది,దేవుని కుమారులు,కుమార్తెలైన మనకే ఈ అద్భుతము సొంతము.ప్రస్తుత కాలములో స్వల్ప భారాలు,భయాలు,శోధనలు కావచ్చు గాని ,మరణ పాశములే అరికట్టనీయండి,పాతాళపు ఉరులే ఆవరించనీయండి...మనము దేవుని ప్రేమలో క్రొత్తగా జన్మిస్తున్నాము.నిన్న సరిపోయిన ప్రేమ ఈరోజుకు చాలదు కానీ,ఈరోజుకు చాలినంత ప్రేమ ఆయనలో ఉంది....అంత ఐశ్వర్యమైనది పరిశుద్ధుని ప్రేమ! మన పరిస్థితులు,భయాలు,శ్రమలు పాతవే కావచ్చు కానీ మనము మాత్రము ఆయన ప్రేమలో క్రొత్తగా జన్మిస్తున్నాం.మనము మన జీవితములో ఎలాంటి పరిస్థితులలో నడుచుచుండినా గాని దేవుని ప్రేమ మనలో నూతనపరచబడుచున్నది అనే విషయమే చాల ఆశ్చర్యము!అద్భుతము!మన అవిశ్వా...