Posts

నా స్వచిత్తము

Image
జ్ఞానులు క్రీస్తును రాజు అని ధృవీకరించేందుకు బంగారాన్ని అర్పించారు. వాళ్లు బంగారం తెచ్చి నిన్ను ధనవంతుడ్ని చేస్తున్నాం అనలేదు. బంగారం, ... అవేవైనా సృజించబడినవి, అన్నింటిపైన ఆయన సర్వశక్తి గలరాజుఅని నువ్వు ధృవీకరించాలి. అందుకోసం మనం బంగారాన్ని ఆయనకు అర్పించాలి. ఎప్పుడు మనం ఆయనను మన సొంత ప్రభువుగా రాజుగా కలిగి ఉండగలమో అప్పుడే అది సాధ్యమౌతుంది. నా స్వంత చిత్తం ఆర్పివేయబడినపుడు అది నాలో పరిపాలన చేయదు. నాలో క్రీస్తే కేవలం క్రీస్తే పరిపాలకుడు, నాలో ఏది ఆయనను సంతోషపెడుతుందో దానిని ఆయన నాలో జరిగిస్తాడు. యోహాను సువార్త 20వ అధ్యా యంలో మగ్దలేని మరియతో తన మరణ పునరుత్థానాల తరువాత “నా తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని సహోదరుల వద్దకు వెళ్లి చెప్పుమన్నారు”. మరియతో “నీవు వెళ్లి నా వద్ద నుండి పారిపోయిన సహోదరులకు వెల్లడి చెయ్యమని” చెప్పటంలో శిక్ష, నిత్య నాశనం పొందవలసిన వారికి, నా ఈ పునరుత్థానం వాళ్లు మంచి కోసమేనని, ఈ పునరుత్థానం వలన నా తండ్రి, వారి తండ్రి అవుతాడని, నా దేవుడే వారి దేవుడౌతాడని చెప్పాడు. హెబ్రీ పత్రిక రాసిన రచయ...

TheBible

Image
బైబిలు చదువు, ఒక దినపత్రికలాగా కాదు, మన ఇంటికి వచ్చిన ఉత్తరం లాగా చదువు. పక్వానికి వచ్చిన పరలోక ఫలాలు వ్రేలాడుతూ మనకు అందేంత సమీపంలోనే అవి ఉన్నాయి, వాటిని ప్రోగుచేసుకో. ఆ పేజీలో వాగ్దానం దొరికిందా నీకు ఇష్టమైనంత సొమ్ము నీవే వ్రాసుకుని బ్యాంకు నుండి సొమ్ము తెచ్చుకునేందుకు నీ చేతిలో ఉన్న ఖాళీ చెక్కు అది, సొమ్ము చేసుకో. ప్రార్థన అక్కడ కనిపించిందా, దానిని పొదివి పుచ్చుకో. అది నీ అంబుల పొదిలో మరో బాణం నీ ఆశను నెరవేర్చేది. పరిశుద్ధతకు ఒక ఉదాహరణ నీముందు కనిపించిందా? దేవుడ్ని అడుగు నీకు ఆయన ఎంత చేయగలడో అంతా చేయమని. ఒకవేళ మహిమాయుతంగా సత్యం బయలు పర్చబడితే నక్షత్రంలాగా నీ జీవితాన్ని ప్రకాశింపజేసేట్లు దానిని నీలో ప్రవేశిం పనివ్వు. నీలోని పరిశుద్ధమైన కోరికలు లతల్లా లేఖనాలను పెనవేసుకోని.అప్పుడు నీవు కూడా కీర్తనాకారునిలా నీ శాసనాన్ని నేను ప్రేమిస్తున్నాను, దినమంతా దానిని ధ్యానిస్తాను” అని చెప్పగలవు. దానిని సాధన చేసేందుకు సిద్ధపడితే తప్ప, లేఖన జ్ఞానాన్ని తలకెక్కించుకుని దాని విషయమై కలలు కంటే ప్రయోజనం లేదు. మనముందుంచబడిన అభిప్రాయాన్ని బాధ్యతగా నిర్వహిస్తే తప్ప ప్రయోజనం లేదు. మన ఆహ్లాదం కోసం...

ఆయనే మానవుడు కావటం -He Himself Becoming Man

Image
యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారము ఆయనకే! ✓ఆయనే మానవుడు కావటం ఆయన దీనత్వానికి పరాకాష్ఠ, మచ్చలేని ఆశీర్వాదంలో ఆయన అనంతుడు; ఐశ్వర్యవంతుడు, నైతికతలో కళ్లు మిరుమిట్లు గొలిపే ప్రకాశత ఆయనది.అనుదినం పాపితో సంబంధం కలిగి ఉండటం మన మలిన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆయనను తాకటం ఎంత వేదనకరం.  ✓ఎడతెగక ఈ జాతి దయనీయత, ఆయనను ఆవరించటం! దాని కొరకు ఆయన మరణించటం! జీవదాత అందరిని దరికి చేర్చేందుకు సమాధికి వెళ్లటం! దేవుని కుమారుడు మానవుల చేతుల్లో అవమానాన్ని,బాధలను పొందుతూ మరణం పొందటానికి విధేయుడు కావటం! ఇది నిజ దీనత్వం. ఓ దు:ఖం, శ్రమల రాజా! ముఖం వికారంగా మారిన సార్వభౌముడా!నీవు వెళ్లిన ఆవేదనలోనికి ఎవ్వరూ వెళ్లలేదు. నీకే మహిమను చెల్లిస్తూ,మేము నీ ఎదుట తలవంచి మోకరిస్తున్నాము. మేము కన్నీటిచేత మూల్గుల చేత జయించబడ్డాము;  ✓మా హృదయాలు చిక్కుకున్నాయి; మా అంతరంగాలు ప్రభావితమయ్యాయి. నీవు చెల్లించిన వెలలేని మూల్యానికి, ఉద్దేశానికి మా జీవితాలను అప్పగించుకుంటున్నాం. క్రీస్తు యథేచ్ఛగా తనకు తానుగా ఎలా లొంగిపోయాడో గుర్తుంచుకో. ✓హతసాక్షి ఏం చెయ్యలేడు గ...

క్రీస్తులో-క్రీస్తువలె || In Christ-Christ Like

Image
యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. క్రీస్తు యేసులో యిప్పుడ ఏదైతే దేవుడు యిచ్చాడో దానికన్న ఎక్కువగా దేవుడు యివ్వడు!  నీవు ఎంతగా దీవించబడ్డావంటే, పరలోకం ఏదైయితే యివ్వగలిగిందో అదంతా యివ్వబడింది! నీవు నీతిమంతుడవుగా, పూర్తిగా క్షమింపబడినవాడుగా, దేవుని కుమారునిగా మార్చబడినావు, ఆయన నిన్ను యిష్ట పడుచున్నాడు. ఆయన నీ స్వరము వినాలనీ, అది మధురమైంది అని చెప్పాలనీ కోరుతున్నాడు. ( పరమ గీతాలు 2:14). నీవు తండ్రియొద్దకు వచ్చినప్పుడు క్రీస్తువలే కనబడుతావు! తన కుమారుడైన యేసును తండ్రీ ఏవిధంగా స్వీకరిస్తాడో, అలాగే నీవు కూడ క్రీస్తులో, క్రీస్తువలే స్వీకరించబడుతావు! (ఎఫెసీ 1:6). క్రైస్తవునిగా నీకున్న వారసత్వం, నీవు క్రీస్తువలే మారుట! తండ్రీ కుమారుని ఎంతగా ప్రేమిస్తున్నడంటే. తన కుమారినిలాగ వున్న వారందరి చేత పరలోకంలో నిలుపుటకు ఆశ కల్గివున్నాడు. తన కుమారిని వలే నిన్ను...

జీవములోను-మరణములోను నీసొంతముగా

Image
యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు  1సమూయేలు 22: 2 మరియు ఇబ్బందిగలవారందరును, అప్పులు చేసికొనిన వారందరును, అసమాధానముగా నుండు వారందరును, అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతియాయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ నాలుగువందలమంది వచ్చియుండిరి. 👉పురాతన ఇశ్రాయేలు యోధులు వరదల్లో ఈదుకుంటూ దావీదు దగ్గరకు వచ్చారు. అప్పటికి దావీదు తలపై కిరీటం లేదు, కేవలం దేవునిచే అభిషేకించబడ్డాడు. వాళ్లు ఆయన్ని కలుసుకోగానే “యెష్షయి కుమారుడా, దావీదు మేము నీ పక్షపు వారము" అన్నారు. వాళ్లు అతనికి చెందినవాళ్లు ఎందుచేతనంటే దేవుడే వాళ్లను దావీదుకు ఇచ్చాడు; వాళ్లు సంతోషంగా అతని పక్షం వాళ్లు కావాలనే తీవ్ర ఆలోచన సఫలమయ్యేంత వరకూ వాళ్లు విశ్రమించరు.మనం కూడా యేసుక్రీస్తు విషయంలో అలానే ఎందుకు అవకూడదు? ✓ప్రభువైన యేసూ! నేను నీవాడను కావటం నీ హక్కు, నన్ను క్షమించుచాలాకాలం నా కోసం నేను జీవించాను. ఇప్పుడు నేను సంతోషంగా నాపైన, నాకు కలిగియున్నవాటిపైన నీ హక్కును గుర్తిస్తున్నాను. ఇక మీదట నీకోసమే జీవించగోరుతున్నాను; ఈ సమయంలోనే నన్ను నేను నీకు సమర్పిం చుకుంటున్నాను. జీవంలో మరణంలో నీవ...

నీ స్థానము క్రీస్తులోనే-Your Place is in Christ.

Image
యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారము ఆయనకే! నీ స్థానము క్రీస్తులోనే.ఈ రోజు నువ్వు క్రీస్తులో నిలిచియున్నావు. నీవునిలిచి యుండటానికి, నీ అనుభవానికీ మధ్య తేడాను గుర్తించటం మర్చిపోకు. నీవు నిలబడింది క్రీస్తులోనే నీ అనుభవం నీ ఉద్రేకంలోనే. జాన్ బనియన్ అంటాడు "మన ఉద్రేకాలు డబ్బులు ఖర్చుపెట్టడం లాంటిది; మన జేబులో ఉన్నంత వరకే.అది చాలా ఎక్కువలా అనిపిస్తుంది గానీ యథార్ధానికి తక్కువే; మనకు ముందుగా పరుగెత్తిన వానిలో మనం (విశ్వాసముంచటం)నిలబడటం, బ్యాంకులో మనకున్న డబ్బు లాంటిది. అది మన అనుదిన వ్యయంచే ప్రభావితం కాదు. నేను కొన్నిమార్లు సంతోషంగా ఉంటాను, కొన్నిమార్లు వడిలిపోయినట్లుంటాను. విస్తారంగా బడలిక చెందుతాను,నరాల సత్తువ కోల్పోయినట్లుంటాను, కానీ వీటిని లెక్క చెయ్యను, నేను శ్రమలు గల చీకటిలోయ గుండా ప్రయాణిస్తున్నా. నా కృంగుదల అస్థిరమైనది. నా స్థానం చెక్కు చెదరనిది, ఎందుచేతనంటే నాకు ముందుగా పరుగెత్తిన (యేసు) వాని యందు స్థిరపర్చబడినది. ఆయన నా యాజకుడు, నా రక్షకుడు, నా శిరస్సు, ఆయనలోనే నేను దేవుని ఎదుట నిలువబోతున్నా...

సెలోపేహాదు కుమార్తేలు-#PastorStephen

Image
యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు  హృదయపూర్వకమైన వందనాలు. సెలోపేహాదు కుమార్తేలు. Unsung heroes- Daring Daughters  -Law.makers -Women.Empowerment -Faithful Daughters.  ఇంకా వీరికి చాలా పేర్లు ఉన్నాయి  📖సంఖ్యాకాండము 27: 1 అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థు లలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. *Daughters of Zelopehad - 5 Mahla, Noah, Hogla, Milcah, Tirza. మనష్షే గోత్రములో యోసేపు కుమారుడైన  సంఖ్యాకాండము -26:29-33 సెలోపేహాదు కుమార్తేలు పరిశుద్ధగ్రంధములో చాల ప్రత్యేకతను సంపాదించుకున్నారు.సెలోపేహాదు కు కుమారులు లేరు, అయిదుగురు కుమార్తేలే.అయితే ఆ సెలోపేహాదు చనిపోయిన తరువాత వాగ్దాన దేశములోనికి ఇశ్రాయేలీయులు సేనలుగా బయల్దేరునట్లు,20 సంవత్సరములు పై ప్రాయముగలవారిని లెక్కించవలెనని మోషే దేవుని వలన ఆజ్ఞ పొందాడు.ఆలాగు లెక్కించునప్పుడు గోత్రములచొప్పున,తండ్రి పేరుచొప్పున లెక్కించి,వారికి చీట్లు తీసి వాగ్దాన ...