Samaritan Woman-And Our Misgivings~ StephyBlesseena
.jpg)
యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో మీకు ప్రత్యేకమైన పరిశుద్ధ వందనములు.యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో మీకు ప్రత్యేకమైన పరిశుద్ధ వందనములు.దేవుడు మిమ్మును తన వాక్యంతో దర్శిస్తున్నారని ,మీరు దీవింపబడుచున్నారని,బలపరచబడుచున్నారని ఎంతో సంతోషముతో నేను దేవుని స్తుతిస్తున్నాను.మీరు ఎలా బలం పొందుకుంటున్నారో మాకు కూడా తెలియపరిస్తే మేము ఇంకా సంతోషిస్తాము.మంచిది !ఈ ప్రశస్తమైన సమయములో లేఖనములలోనికి వెల్దాము.ఈ దినపు వాక్యము :మనమింకా గ్రహించని మనలోని సందేహాలు! . సాధారణముగా ప్రతి విశ్వాసిలో ఇలాంటి ఆలోచనలు సందేహాలు ఉంటూనే ఉన్నాయి,అయితే కొందరు వాటికి గ్రహించి విడిచిపెడుతున్నారు .మరికొందరేమో వాటిని గ్రహించలేక వాటివలన ఎంతో నష్టపోతూ చివరికి దేవుని విడిచిపెడుతున్నారు ,సమరయ స్త్రీ ని గురించిన భాగములో ప్రభువు ఆమెను దర్శించిన సంగతి మనందరికీ చాల సుపరిచితమే.ఆమె పొందిన ప్రత్యక్షత చాల ఆశ్చర్యకరం !ఆమె ఆలోచనలలో అడుగడుగునా మార్పులు ఎదుగుదల కనపడుతూనే ఉన్నాయి.అలాగే ఆమెలోని లోపములు కూడా ఎంతో జ్ఞానముతో సరిచేయబడినవి,గమనించండి ,దేవుని జ్ఞానము మనలను చక్కపరుస్తుంది.ఆ జ్ఞానము మనలను చక్కని మార్గమ...