Posts

Showing posts from 2023

నా స్వచిత్తము

Image
జ్ఞానులు క్రీస్తును రాజు అని ధృవీకరించేందుకు బంగారాన్ని అర్పించారు. వాళ్లు బంగారం తెచ్చి నిన్ను ధనవంతుడ్ని చేస్తున్నాం అనలేదు. బంగారం, ... అవేవైనా సృజించబడినవి, అన్నింటిపైన ఆయన సర్వశక్తి గలరాజుఅని నువ్వు ధృవీకరించాలి. అందుకోసం మనం బంగారాన్ని ఆయనకు అర్పించాలి. ఎప్పుడు మనం ఆయనను మన సొంత ప్రభువుగా రాజుగా కలిగి ఉండగలమో అప్పుడే అది సాధ్యమౌతుంది. నా స్వంత చిత్తం ఆర్పివేయబడినపుడు అది నాలో పరిపాలన చేయదు. నాలో క్రీస్తే కేవలం క్రీస్తే పరిపాలకుడు, నాలో ఏది ఆయనను సంతోషపెడుతుందో దానిని ఆయన నాలో జరిగిస్తాడు. యోహాను సువార్త 20వ అధ్యా యంలో మగ్దలేని మరియతో తన మరణ పునరుత్థానాల తరువాత “నా తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని సహోదరుల వద్దకు వెళ్లి చెప్పుమన్నారు”. మరియతో “నీవు వెళ్లి నా వద్ద నుండి పారిపోయిన సహోదరులకు వెల్లడి చెయ్యమని” చెప్పటంలో శిక్ష, నిత్య నాశనం పొందవలసిన వారికి, నా ఈ పునరుత్థానం వాళ్లు మంచి కోసమేనని, ఈ పునరుత్థానం వలన నా తండ్రి, వారి తండ్రి అవుతాడని, నా దేవుడే వారి దేవుడౌతాడని చెప్పాడు. హెబ్రీ పత్రిక రాసిన రచయ...

TheBible

Image
బైబిలు చదువు, ఒక దినపత్రికలాగా కాదు, మన ఇంటికి వచ్చిన ఉత్తరం లాగా చదువు. పక్వానికి వచ్చిన పరలోక ఫలాలు వ్రేలాడుతూ మనకు అందేంత సమీపంలోనే అవి ఉన్నాయి, వాటిని ప్రోగుచేసుకో. ఆ పేజీలో వాగ్దానం దొరికిందా నీకు ఇష్టమైనంత సొమ్ము నీవే వ్రాసుకుని బ్యాంకు నుండి సొమ్ము తెచ్చుకునేందుకు నీ చేతిలో ఉన్న ఖాళీ చెక్కు అది, సొమ్ము చేసుకో. ప్రార్థన అక్కడ కనిపించిందా, దానిని పొదివి పుచ్చుకో. అది నీ అంబుల పొదిలో మరో బాణం నీ ఆశను నెరవేర్చేది. పరిశుద్ధతకు ఒక ఉదాహరణ నీముందు కనిపించిందా? దేవుడ్ని అడుగు నీకు ఆయన ఎంత చేయగలడో అంతా చేయమని. ఒకవేళ మహిమాయుతంగా సత్యం బయలు పర్చబడితే నక్షత్రంలాగా నీ జీవితాన్ని ప్రకాశింపజేసేట్లు దానిని నీలో ప్రవేశిం పనివ్వు. నీలోని పరిశుద్ధమైన కోరికలు లతల్లా లేఖనాలను పెనవేసుకోని.అప్పుడు నీవు కూడా కీర్తనాకారునిలా నీ శాసనాన్ని నేను ప్రేమిస్తున్నాను, దినమంతా దానిని ధ్యానిస్తాను” అని చెప్పగలవు. దానిని సాధన చేసేందుకు సిద్ధపడితే తప్ప, లేఖన జ్ఞానాన్ని తలకెక్కించుకుని దాని విషయమై కలలు కంటే ప్రయోజనం లేదు. మనముందుంచబడిన అభిప్రాయాన్ని బాధ్యతగా నిర్వహిస్తే తప్ప ప్రయోజనం లేదు. మన ఆహ్లాదం కోసం...

ఆయనే మానవుడు కావటం -He Himself Becoming Man

Image
యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారము ఆయనకే! ✓ఆయనే మానవుడు కావటం ఆయన దీనత్వానికి పరాకాష్ఠ, మచ్చలేని ఆశీర్వాదంలో ఆయన అనంతుడు; ఐశ్వర్యవంతుడు, నైతికతలో కళ్లు మిరుమిట్లు గొలిపే ప్రకాశత ఆయనది.అనుదినం పాపితో సంబంధం కలిగి ఉండటం మన మలిన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆయనను తాకటం ఎంత వేదనకరం.  ✓ఎడతెగక ఈ జాతి దయనీయత, ఆయనను ఆవరించటం! దాని కొరకు ఆయన మరణించటం! జీవదాత అందరిని దరికి చేర్చేందుకు సమాధికి వెళ్లటం! దేవుని కుమారుడు మానవుల చేతుల్లో అవమానాన్ని,బాధలను పొందుతూ మరణం పొందటానికి విధేయుడు కావటం! ఇది నిజ దీనత్వం. ఓ దు:ఖం, శ్రమల రాజా! ముఖం వికారంగా మారిన సార్వభౌముడా!నీవు వెళ్లిన ఆవేదనలోనికి ఎవ్వరూ వెళ్లలేదు. నీకే మహిమను చెల్లిస్తూ,మేము నీ ఎదుట తలవంచి మోకరిస్తున్నాము. మేము కన్నీటిచేత మూల్గుల చేత జయించబడ్డాము;  ✓మా హృదయాలు చిక్కుకున్నాయి; మా అంతరంగాలు ప్రభావితమయ్యాయి. నీవు చెల్లించిన వెలలేని మూల్యానికి, ఉద్దేశానికి మా జీవితాలను అప్పగించుకుంటున్నాం. క్రీస్తు యథేచ్ఛగా తనకు తానుగా ఎలా లొంగిపోయాడో గుర్తుంచుకో. ✓హతసాక్షి ఏం చెయ్యలేడు గ...

క్రీస్తులో-క్రీస్తువలె || In Christ-Christ Like

Image
యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. క్రీస్తు యేసులో యిప్పుడ ఏదైతే దేవుడు యిచ్చాడో దానికన్న ఎక్కువగా దేవుడు యివ్వడు!  నీవు ఎంతగా దీవించబడ్డావంటే, పరలోకం ఏదైయితే యివ్వగలిగిందో అదంతా యివ్వబడింది! నీవు నీతిమంతుడవుగా, పూర్తిగా క్షమింపబడినవాడుగా, దేవుని కుమారునిగా మార్చబడినావు, ఆయన నిన్ను యిష్ట పడుచున్నాడు. ఆయన నీ స్వరము వినాలనీ, అది మధురమైంది అని చెప్పాలనీ కోరుతున్నాడు. ( పరమ గీతాలు 2:14). నీవు తండ్రియొద్దకు వచ్చినప్పుడు క్రీస్తువలే కనబడుతావు! తన కుమారుడైన యేసును తండ్రీ ఏవిధంగా స్వీకరిస్తాడో, అలాగే నీవు కూడ క్రీస్తులో, క్రీస్తువలే స్వీకరించబడుతావు! (ఎఫెసీ 1:6). క్రైస్తవునిగా నీకున్న వారసత్వం, నీవు క్రీస్తువలే మారుట! తండ్రీ కుమారుని ఎంతగా ప్రేమిస్తున్నడంటే. తన కుమారినిలాగ వున్న వారందరి చేత పరలోకంలో నిలుపుటకు ఆశ కల్గివున్నాడు. తన కుమారిని వలే నిన్ను...

జీవములోను-మరణములోను నీసొంతముగా

Image
యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు  1సమూయేలు 22: 2 మరియు ఇబ్బందిగలవారందరును, అప్పులు చేసికొనిన వారందరును, అసమాధానముగా నుండు వారందరును, అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతియాయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ నాలుగువందలమంది వచ్చియుండిరి. 👉పురాతన ఇశ్రాయేలు యోధులు వరదల్లో ఈదుకుంటూ దావీదు దగ్గరకు వచ్చారు. అప్పటికి దావీదు తలపై కిరీటం లేదు, కేవలం దేవునిచే అభిషేకించబడ్డాడు. వాళ్లు ఆయన్ని కలుసుకోగానే “యెష్షయి కుమారుడా, దావీదు మేము నీ పక్షపు వారము" అన్నారు. వాళ్లు అతనికి చెందినవాళ్లు ఎందుచేతనంటే దేవుడే వాళ్లను దావీదుకు ఇచ్చాడు; వాళ్లు సంతోషంగా అతని పక్షం వాళ్లు కావాలనే తీవ్ర ఆలోచన సఫలమయ్యేంత వరకూ వాళ్లు విశ్రమించరు.మనం కూడా యేసుక్రీస్తు విషయంలో అలానే ఎందుకు అవకూడదు? ✓ప్రభువైన యేసూ! నేను నీవాడను కావటం నీ హక్కు, నన్ను క్షమించుచాలాకాలం నా కోసం నేను జీవించాను. ఇప్పుడు నేను సంతోషంగా నాపైన, నాకు కలిగియున్నవాటిపైన నీ హక్కును గుర్తిస్తున్నాను. ఇక మీదట నీకోసమే జీవించగోరుతున్నాను; ఈ సమయంలోనే నన్ను నేను నీకు సమర్పిం చుకుంటున్నాను. జీవంలో మరణంలో నీవ...

నీ స్థానము క్రీస్తులోనే-Your Place is in Christ.

Image
యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారము ఆయనకే! నీ స్థానము క్రీస్తులోనే.ఈ రోజు నువ్వు క్రీస్తులో నిలిచియున్నావు. నీవునిలిచి యుండటానికి, నీ అనుభవానికీ మధ్య తేడాను గుర్తించటం మర్చిపోకు. నీవు నిలబడింది క్రీస్తులోనే నీ అనుభవం నీ ఉద్రేకంలోనే. జాన్ బనియన్ అంటాడు "మన ఉద్రేకాలు డబ్బులు ఖర్చుపెట్టడం లాంటిది; మన జేబులో ఉన్నంత వరకే.అది చాలా ఎక్కువలా అనిపిస్తుంది గానీ యథార్ధానికి తక్కువే; మనకు ముందుగా పరుగెత్తిన వానిలో మనం (విశ్వాసముంచటం)నిలబడటం, బ్యాంకులో మనకున్న డబ్బు లాంటిది. అది మన అనుదిన వ్యయంచే ప్రభావితం కాదు. నేను కొన్నిమార్లు సంతోషంగా ఉంటాను, కొన్నిమార్లు వడిలిపోయినట్లుంటాను. విస్తారంగా బడలిక చెందుతాను,నరాల సత్తువ కోల్పోయినట్లుంటాను, కానీ వీటిని లెక్క చెయ్యను, నేను శ్రమలు గల చీకటిలోయ గుండా ప్రయాణిస్తున్నా. నా కృంగుదల అస్థిరమైనది. నా స్థానం చెక్కు చెదరనిది, ఎందుచేతనంటే నాకు ముందుగా పరుగెత్తిన (యేసు) వాని యందు స్థిరపర్చబడినది. ఆయన నా యాజకుడు, నా రక్షకుడు, నా శిరస్సు, ఆయనలోనే నేను దేవుని ఎదుట నిలువబోతున్నా...

సెలోపేహాదు కుమార్తేలు-#PastorStephen

Image
యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు  హృదయపూర్వకమైన వందనాలు. సెలోపేహాదు కుమార్తేలు. Unsung heroes- Daring Daughters  -Law.makers -Women.Empowerment -Faithful Daughters.  ఇంకా వీరికి చాలా పేర్లు ఉన్నాయి  📖సంఖ్యాకాండము 27: 1 అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థు లలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. *Daughters of Zelopehad - 5 Mahla, Noah, Hogla, Milcah, Tirza. మనష్షే గోత్రములో యోసేపు కుమారుడైన  సంఖ్యాకాండము -26:29-33 సెలోపేహాదు కుమార్తేలు పరిశుద్ధగ్రంధములో చాల ప్రత్యేకతను సంపాదించుకున్నారు.సెలోపేహాదు కు కుమారులు లేరు, అయిదుగురు కుమార్తేలే.అయితే ఆ సెలోపేహాదు చనిపోయిన తరువాత వాగ్దాన దేశములోనికి ఇశ్రాయేలీయులు సేనలుగా బయల్దేరునట్లు,20 సంవత్సరములు పై ప్రాయముగలవారిని లెక్కించవలెనని మోషే దేవుని వలన ఆజ్ఞ పొందాడు.ఆలాగు లెక్కించునప్పుడు గోత్రములచొప్పున,తండ్రి పేరుచొప్పున లెక్కించి,వారికి చీట్లు తీసి వాగ్దాన ...

Casting Breads on Waters -To Gather them after many days.

Image
Greetings to You all in marvellous name of our LORD and SAVIOUR JESUS CHRIST. It's been 1 or 2 months.We forgot.The shuttle cock got struck in the thickest branches of the Coconut 🥥 tree. *It may seem to be so childish,but we can't expect how God speaks to us 👍? It was stuck in the branches.And we hopelessly left it there and forgot about that.But Yesterday there was a Fierce wind,that even shook the strong Coconut🥥 trees 🌴,and the shuttle cock fell down.And When I saw that,Iam sure it's God who reminded me of something, from 📖 ప్రసంగి 11: 1 నీ ఆహారమును నీళ్లమీద వేయుము,చాలా దినము... లైన తరువాత అది నీకు కనబడును. Ecclesiastes 11: 1 Cast thy bread upon the waters: for thou shalt find it after many days. And I still feel that calmness in my mind . Actually I don't know it's meaning.But when I was Young ,might be in my 8th or 9th class,In a Cottage Prayer,one of the servants of God preached this verse,but I didn't und...

నా హేబేలు అర్పణ-MyAbel Offering

Image
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఆదిలోనే దేవుని చేత వెళ్ళగొట్టబడిన కుటుంబము. ఆదాము,హవ్వల రెండవ కుమారుడు.కయీనుకు చిన్న తమ్ముడు.తమ తండ్రి ఏదేనులోనుండి వెళ్లగొట్టబడిన తరువాత కలిగిన సంతానము.కయీను భూమిని సేద్యపరస్తు...తన పంటలోనుండి కొంత,హేబేలు గొర్రెలను మేపుకుంటూ తన మందలో తొలిచూలిన పుటినవాటిలో క్రోవ్విన వాటిని దేవునికి అర్పణగా తెచ్చారు.కాని దేవుడు హేబేలు అర్పణ మాత్రమే అంగీకరించారు.కారణం? కయీను తెచ్చిన పంటలోని అర్పణ ఆయనకి నచ్చలేదా?మరి దేవుడు అన్నదమ్ముల మధ్య భేదము చూపారా?ఎందుకు హేబేలు అర్పణ దేవుడు లక్ష్యపెట్టి అంగీకరించాడు? And Abel brought of the firstborn of his flock and of the fat portions. And  the Lord had respect and regard for Abel  and for his offering, [Heb. 11:4.] Genesis 4:4 AMPC దేవుడు హేబేలును లక్ష్యపెట్టుటకు ముందు హేబెలును గౌరవించాడా?అయినా ఒక శపించబడ్డ వాణి కుమారుడిని ఎలా లక్ష్యపెట్టగలడు దేవుడు?ఎలా గౌరవించగలడు దేవుడు? *కయీను తెచ్చిన అర్పణ...ఏదో ఒక కృతజ్ఞతార్పణగా కనపడుతుంది ✓కానీ హేబేలు తెచ్చిన అర్పణ దహ...

వాగ్దానానికి బయట నిలిచిపోయిన మిర్యాము.Miriam-Stood outside the Promised Land.

Image
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు🙏. మిర్యాయము జీవితములునుండి కొన్ని విషయాలని ధ్యానించుకుందాము. ✝️సoఖ్య కాండము-20:1 మిర్యాము కాదేషులో పాతిపెట్టబడినది.ఈ అధ్యాయములో మనము ఇస్రాయెలీయులు ఇంకా వాగ్దాన దేశములోనికి వెళ్ళినట్లు,ఇంకా యాత్రలో నున్నట్లు చూడగలము.అల యాత్ర లోనున్నప్పుడే మిర్యాము మరనించి పాతిపెట్టబడినది. ✓కానీ దావీదు అయితే తాను దేవుని దేశమునకు వెలుపల నుండకూడదు,మరణించకూడదు అని ఎంత విలపించాడో! 📖1సమూయేలు-26:19, 20 "నా దేశమునకు దూరముగాను, యెహావా సన్నిధికి ఎడముగాను నేను మరణము పొంద కపోవుదునును." ✓వాగ్దాన దేశములో చనిపాయి పాతిపెట్టబడుట ఆశీర్వాదం. *అయితే మిర్యాము - కాదేషు లో అనగా వాగ్దాన దేశానికి వెలుపల మరణించి పాతిపెట్టబడినది. కానీ విశ్వాస జీవితము అది కాదు. యోసెఫు విశ్వాసం ఎమిటంటే- 📖ఆదికాండము 50: 25 మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును; అప్పుడు మీరు నా యెముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారులచేత ప్రమాణము చేయించు కొనెను. 📖నిర్గమకాండము 13: 19 మరియు మోషే యోసేపు ఎముకలను తీసికొని వచ్చెను....

Standing Before God-Standing before the Enemy

Image
మన ప్రభువైన ✝️యేసుక్రీస్తు✝️ పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు.🙏🙏🙏.ఈ వాక్యము చదువుతున్న మీరు బాగున్నారని నమ్ముతున్నాను.మంచిది. వాక్య భాగములోనికి వెళ్దాము. ఏలా లోయలో దావీదుకు -గోల్యాతుకు మధ్య జరిగిన యుద్దములో మరో విషయాన్ని ధ్యానించుదాం. *1సమూయేలు 17: 40 ​తన కఱ్ఱ చేత పట్టుకొని యేటి లోయలో నుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను . *1సమూయేలు 17: 41 ​డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకువచ్చి *1సమూయేలు 17: 42 ​చుట్టు పారచూచి దావీదును కనుగొని , అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను.      1. Yours is the First Step- Your is the initiative. శత్రువు వైపుగా,శత్రువుకు ఎదురుగా వేసే మొదటి అడుగు నీదే . Whatever struggle or Goliath like Enemy is standing before you,remember You are the One who should walk towards the enemy . దావీదు శత్రువువైపునకు ,మరింత స్పష్టముగా ఆ ఫిలిష్ఠియుని చేరువకు పోయెను.విశ్వాసపు అడుగు న...

Remembering God's deeds-దేవుని జ్ఞాపకము చేసికొనుట

Image
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. 1సమూయేలు 17: 37 ​సింహము యొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు-పొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను. దావీదు నిజముగానే యుద్దము చేసి గొల్యాతును గెలిచాడా?యుద్ధం అంటే ఇద్దరు పోరాడితేనే కదా...మరి ఎలా ఏకముగా లోయలో అలాంటి పోరాటాలు ఏమి జరుగలేదే! అంతా సునాయాసముగా దావీదు గొల్యాతును ఎలా గెలిచాడు?అలా యుద్ధము చేయకుండనే నామమాత్రముగా అలా చేయి ఆడించి.... గెలిచాడా దావీదు? ఇశ్రాయేలీయులు చూడని యుద్దాలా,వారికి పరిచయము లేని యుద్దాలా?ఐగుప్తు విడిచినది మొదలు,ఎన్నెన్ని యుద్దాలు చేసి గెలిచారు,మరి ఈ సమయంలో వారికి ధైర్యము కలగలేదు.వారికి కలుగని ధైర్యము దావీదుకు ఎలా కలిగింది?ఇశ్రాయేలీయుల మీద మొదటిగా అభిషేకింపబడిన రాజైన సౌలుకు కూడ ధైర్యము కలగలేదు.దేవుని మేలులు జ్ఞాపకము చేసికొనడం సర్వ సామాన్యమైన స్తుతి అనుకుంటాము,కాని ఆ జ్ఞాపకములో ఎంత బలముందో,శక్తి ఉందో!అదే మన ప్రాణానికి నిరీక్షణ,బలము అని తెలుసుకోవా...

వాగ్దాన-నెరవేర్పు-పరిపక్వత

Image
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు మనందరి జీవితములో కనపడే ఓ చిన్న విషయము ధ్యానం చేసుకుందాము.ఎందుకంటే అది చాలా స్వల్పమైనది,సాధారణముగ మనము గ్రహించలేనంత సూక్ష్మమైనది.దానిని మన జీవితములో సరి చేసుకొని,చక్కపరచుకుంటే మన మార్గాలు సరళమైనట్లే.మనలో ప్రతి వ్యక్తి,దేవుని పరిశుద్ధ వాక్యమును చదివే ప్రతి వ్యక్తి,చదువబడిన ఆ వాక్యపు నేరవేర్పుకోరకు ఆశపడతాము,చాలా ఎదురుచూస్తాం.కానీ చివరికి ఆ నేరవేర్పు మన కన్నుల ఎదుటే ప్రత్యక్షపరచబడితే దానిని పొల్చుకోలేక,తట్టుకోలేక,నమ్మలేక,మనలను ఆ నేరవేర్పులో చూచుకోనలేక....ఎన్ని నేరవేర్పులను మన జీవితంలో కోల్పోయి యుంటామో!Ii ఈ విషయములో ఎంత మంది నాతో అంగీకరించగలరు? Comment about yourself. ✓📖సంఖ్యాకాండము 13: 27 వారు అతనికి తెలియపరచినదేమనగానీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితిమి; అది పాలు తేనెలు ప్రవ హించు దేశమే; దాని పండ్లు ఇవి. ✓📖సంఖ్యాకాండము 13: 31 ​అయితే అతనితో కూడ పోయిన ఆ మనుష్యులుఆ జనులు మనకంటె బల వంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి. ✓📖సంఖ్యాకాండము 13: 32 ​​మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ...

I will fight-నేను పొట్లాడుదును.

Image
ఇతరుల మీద ఆధారపడే మనస్సు మన వ్యక్తిగత జీవితములోని గొల్యాతును చంపడానికి ఉపయోగ పడదు. మన అనుదిన జీవితములో ఎదురుపడే ఓ చిన్న సమస్య.మరో విధముగా చెప్పాలంటే ప్రతి దినము మనము ఓడిపోయే యుద్దము,ఇదే. మన సమస్యలో,మన బాధలో,మన దుఃఖంలో,గొల్యాతు  అనే శోధనలు-యుద్దములు ఎదురైనపుడు ఎవరైనా వచ్చి మన పక్షముగా నిలబడాలి,మనకు సహాయపడాలి,అని మనము ఎంత ఆశతో కోరుకుంటాము.కాని మనమే ఆ సమయములో నిలువబడాల్సిన విషయాన్ని మార్చపోతునము. ✝️లేఖనానుసారముగా మనము పిరికివారము కాదు,ఇంద్రియనిగ్రహముగల శక్తితో ప్రభువు మనలను నింపారు. 👉 2తిమోతికి 1: 7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల (స్వస్థబుద్ధియుగల ఆత్మనే) ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మనియ్యలేదు. *ఆ ఏలా లోయలో ఇశ్రాయేలీయుల పరిస్థతిని మనము ఆలోచిస్తే వారు ఇలాంటి లోపమువల్లనే,తమ శత్రువులైన గొల్యాతును ఎదురించి చంపలేకపోయారు.వారికి తెలియని యుద్దాలా?వారికి తెలియని జయలా? *కానీ ఎప్పటివలెనే సైన్యమంతా కలిసి శత్రువు మీద దాడి చేసే పరిస్థితి కాదిప్పుడు.వారి ముందరకు వచ్చిన సమస్య ,వారిలో ఎవరైనా ఒక్కరే సైన్యమంతటి పక్షముగా యుద్దం చేయాలి.నిజానికీ అది ఎంత చిక్కుగానున...